పవన్ కళ్యాణ్ – పూనమ్ కౌర్(Pawan Kalyan – Poonam Kour).. ఈ రెండుపేర్లు కలిపి కొన్నాళ్ల పాటు మీడియాలో ఓ రేంజ్ లో వినిపించాయి. అందుకు కారణాలేంటీ..? తర్వాత పరిణామాలేంటీ అనేది ప్రస్తుతానికి అనవసరం. అయితే పూనమ్ కు పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం అని అప్పట్లో నిత్యం ఏదోలా చూపించుకునేది. ఇప్పటికీ అంతే. కాకపోతే ఎప్పుడైనా కాస్త తేడా అనిపిస్తే కౌంటర్ వేయడానికో, సెటైర్ వేయడానికో ఏ మాత్రం వెనకాడటం లేదు. అఫ్ కోర్స్ వాటికి పవన్ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో దీటుగా కౌంటర్స్ వేస్తారు. లేటెస్ట్ గా మరోసారి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) టార్గెట్ గా పూనమ్ కౌర్ చేసిన కమెంట్స్ వైరల్ గా మారాయి. తను ఎక్కడా పవన్ పేరు ప్రస్తావించలేదు. బట్ ఆ మాటలు నేరుగా అతన్నే అన్నట్టుగా ఉన్నాయి. ఇంతకీ తనేమందంటే..
“మీరు విప్లవకారులను గౌరవించకపోయినా ఇబ్బంది లేదు. కానీ అవమానించొద్దు. ఈ మధ్య రిలీజ్ అయిన ఒక సినిమా పోస్టర్ లో ఒక వ్యక్తి కాలికింద భగత్ సింగ్ ( Bhagath Singh)అనే పేరు ఉంది. ఇది అహంకారమా..? లేక అజ్ఙానమా..?”అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. ఇది పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గురించే అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ పోస్టర్ లో పవన్ బూటు కాలి ముందు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఉంది. దీంతో పూనమ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే ఈ వ్యాఖ్యలు చేసిందంటున్నారు చాలామంది. హరీశ్ శంకర్(Harish Shankar) డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి సంబంధించి మొదట భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టారు. అప్పుడూ విమర్శలు వచ్చాయి. వీరుడైన భగత్ ను భవదీయుడుగా ఎలా మారుస్తారంటూ హరీష్ ను నెటిజన్స్ ఓ రేంజ్ లో ప్రశ్నించారు.
ఇక ఇప్పుడు పూనమ్ ప్రశ్నకు సోషల్ మీడియాలో మిక్స్ టాక్ వినిపిస్తోంది. అయితే చాలామంది తను చెప్పింది నిజమే కదా అంటూ సోపోర్ట్ చేశారు. మరికొందరు కావాలనే పూనమ్ ఇలా చేస్తోందంటూ విమర్శించారు. బట్ ఓవరాల్ గా చూస్తే పూనమ్ చెప్పిన దాంట్లో నిజం ఉంది. కొందరివి కేవలం పేర్లు కాదు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులు వాళ్లు. అలాంటి వ్యక్తులకు ఏ రకంగా అవమానం జరిగినా ఖండించొచ్చు.