ప్రకాష్ రాజ్ ను వదలనంటోన్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్.. పొలిటికల్ గా భిన్న ధృవాలు. ప్రకాష్ రాజ్ కాస్త అభ్యుదయం వైపు ఉంటాడు. పవన్ ఎప్పుడు ఏ వైపు ఉంటాడో చెప్పలేం. అందుకే ప్రజల్లో చాలా మార్పు తేగల సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ సరైన స్టాండ్ తీసుకోలేకపోవడం వల్లే పొలిటికల్ గా ఫెయిల్ అవుతుంటాడు ప్రకాష్ రాజ్ అభిప్రాయ పడుతుంటాడు. అయితే ఇదంతా ఆఫ్ స్క్రీన్ లోనే.

ఆన్ స్క్రీన్ లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అవుతుందని ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. ఆ సినిమాలకు మూలం బద్రి. ఈ చిత్రంలో ఇద్దరి మధ్యా వచ్చే సీన్స్ టగ్ ఆఫ్ వార్ లా ఉంటాయి. అప్పటి నుంచి ఈ కాంబోలో ఏ సినిమా వచ్చినా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన ఫస్ట్ మూవీలోనూ వీరి కాంబో డిఫరెంట్ గా ఉంటుంది. ప్రకాష్ రాజ్ పోలీస్ అయితే.. పవన్ నక్సలైట్ గా కనిపించాడు. పైగా తర్వాత ఆయన కూతుళ్లనే ప్రేమిస్తాడు కూడా.

ఆ క్రమంలో వచ్చే సీన్స్ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయి. అయితే రీసెంట్ గా వచ్చిన వకీల్ సాబ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో ఈ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ కు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. నటుడుగా ప్రకాష్ రాజ్ రేంజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇటు పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలియంది కాదు.

ఈ రెండూ మిక్స్ అవడం వల్లే వారి మధ్య సన్నివేశాలు అద్భుతంగా పండుతాయి. పైగా పవన్ కళ్యాణ్ కూడా తన ముందు ఓ మంచి నటుడు ఉంటే తనకూ ఊపొస్తుందని.. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లైతే ఇంకా బావుంటుందని వకీల్ సాబ్ టైమ్ లో చెప్పాడు కూడా. అందుకే ఇప్పుడు మరోసారి ప్రకాష్ రాజ్ ను తన సినిమాలోకి తీసుకునేలా చేశాడు.


చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తోన్న ‘ఓ.జి’చిత్రంలో ప్రకాష్ రాజ్ ను ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. అతను విలనా కాదా అనేది అప్పుడే చెప్పలేం కానీ.. ప్రస్తుతం ముంబైలో జరుగుతోన్న షూట్ లోకి ప్రకాష్ రాజ్ కూడా ఎంటర్ అయ్యాడు.

రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో నాని గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. మరో హీరోయిన్ కూ ఛాన్స్ ఉంటుందట. ఇక విశేషం ఏంటంటే.. ముంబైలో వారం రోజులు మాత్రమే షెడ్యూల్ అనుకున్నారు. కానీ అవుట్ పుట్ బావుండటంతో మరికొన్ని రోజులు షెడ్యూల్ ను ఎక్స్ టెండ్ చేశారట. ఏదేమైనా పవన్ అభిమానులు మాత్రం ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

Related Posts