పవన్ కళ్యాణ్‌ – హరీష్‌ శంకర్ ఓ రివెంజ్ డ్రామా..?

పవన్ కళ్యాణ్‌ – హరీశ్ శంకర్.. ఈ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఈ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఆ టైమ్ కు పవన్ కు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి ముందు పవన్ కళ్యాణ్‌ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. వాటిని దాటించి గబ్బర్ సింగ్ వంటి మూవీతో హరీష్‌ కూడా పవన్ ఫ్యాన్స్ కు అభిమాన దర్శకుడు అయ్యాడు. అలాంటి కాంబో కోసం వాళ్లు కూడా చాలాకాలంగా చూస్తున్నారు. ఫైనల్ గా ఓ కే అయింది. బట్ సెట్స్ పైకి వెళ్లడం లేదు. టైటిల్ ను రెండు సార్లు మార్చారు. తప్ప షూటింగ్ టైమ్ చెప్పడం లేదు. దీంతో అసలు వీరి మధ్య ఏ౦ జరుగుతుందా అనే ప్రశ్నకు ఓ కొత్త సమాధానం కనిపిస్తోంది. ఖచ్చితంగా చెబితే హరీష్‌ శంకర్ పై పవన్ కళ్యాణ్‌ రివెంజ్ ఇది అనీ అంటున్నారు. మరి అంత పగకు కారణం ఏంటీ..?


పవర్ స్టార్ గా ఫ్యాన్స్ లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్‌. అయితే ఆ ట్యాగ్ కు తగ్గట్టుగా కొన్నాళ్లుగా ఆయన ప్రవర్తించడం లేదు అనే టాక్ కూడ ఇండస్ట్రీలో ఉంది. ముఖ్యంగా తనను ఇంత వాడిని చేసిన పరిశ్రమను చాలా చిన్న చూపు చూస్తున్నాడు అన్న విమర్శలు పెరుగుతున్నాయి. అందుకు కారణం.. హరీష్‌ శంకర్ ను హోల్డ్ లో పెట్టడంతో పాటు ప్రస్తుతం చేస్తోన్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సాగుతున్న తీరు. ఈ చిత్రం మొదలై రెండేళ్లవుతోంది. ఇంకా 60శాతం కూడా పూర్తి కాలేదు. అసలే ఆ నిర్మాత లాస్ లో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఆదుకోకపోయినా ఫర్వాలేదు కానీ.. ఇలా షూటింగ్స్ ఎగ్గొట్టి ఇబ్బంది పెట్టడం ఏ మేరకు సబబు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ కారణంగానే కొందరు నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ తో సినిమా అంటే భయపడుతున్నారు అనే మాటలూ వినిపిస్తున్నాయి. ఇక చివరికి డివివి దానయ్య ధైర్యం చేశాడు. సుజిత్ డైరెక్షన్ లో సినిమా మొదలైంది. అయితే దీనికంటే ముందే ఓకే అయిన హరీష్‌ శంకర్ ప్రాజెక్ట్ మాటేంటీ అంటే సమాధానం లేదు. కానీ.. దీనికి ఓ చిత్రమైన వివరణ లాంటిది కనిపిస్తుంది. ఇది తెలిస్తే పవన్ కళ్యాణ్‌ కావాలనే హరీష్‌ ను ఇబ్బంది పెడుతున్నాడు అనే కంక్లూషన్ కు వస్తారు.


అదేంటో తెలియాలంటే మనం గబ్బర్ సింగ్ సీక్వెల్ కు వెళ్లాలి. గబ్బర్ సింగ్ తర్వాత దానికి సీక్వెల్ తీయాలనుకున్నాడు పవన్ కళ్యాణ్‌. ఆల్రెడీ క్రేజీ కాంబినేషన్ గా డిక్లేర్ అయింది కాబట్టి.. ఈ సీక్వెల్ ను కూడా హరీష్‌ తో చేయాలనుకున్నాడు. అందుకు హరీష్‌ కూడా ఒప్పుకున్నాడు అంటారు. తీరా ఓపెనింగ్ టైమ్ దగ్గకు వస్తున్నప్పుడు హరీష్‌ రెస్పాండ్ కాలేదట. పవన్ తో పాటు ఆయన టీమ్ కూడా చాలా ట్రై చేసినా ఫోన్ కూడా తీయలేదు అంటారు. అయితే హరీష్‌ రెస్పాండ్ కాకపోవడానికి కారణం.. అతనికి ఆల్రెడీ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథమ్ ఓకే కావడమే అనేది తర్వాత తెలిసిందట.

అంటే తనకంటే అల్లు అర్జున్ బెటర్ అని హరీష్‌ భావించాడు అని పవన్ కళ్యాణ్‌ హర్ట్ అయ్యాడట. తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి బాబీని తీసుకున్నాడు పవన్ కళ్యాణ్‌. అప్పట్లో చాలామంది పవన్ నిర్ణయం తప్పు అనుకున్నారు. కానీ వాస్తవం ఇదేనట. దీంతో ఇప్పుడు అతనికి సినిమా ఇచ్చినట్టే ఇచ్చి తనను ఇబ్బంది పెట్టిన దర్శకుడి టైమ్ మొత్తం వేస్ట్ చేయిస్తున్నాడు అనే టాక్ ఉంది. మరి ఇది నిజమా కాదా అనేది ఆ ఇద్దరితో పాటు వారి అత్యంత సన్నిహితులకు తెలియాలి. నిజమే అయితే.. హరీష్‌ శంకర్ చేసింది ఎంత తప్పో.. ఇప్పుడు పవన్ చేస్తుంది కూడా అంతే తప్పు అనొచ్చా..?

Related Posts