ముందే చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్‌ నుంచి కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. అయితే అంతా ఊహించినట్టుగా హరీష్‌ శంకర్ సినిమా కాక సుజిత్ డైరెక్షన్ లో రూపొందే సినిమాను ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్‌ హరీశ్ శంకర్ కు మరోసారి హ్యాండ్ ఇచ్చాడు అంటున్నారు. హ్యాండ్ మేటర్ ఏమో కానీ.. సుజిత్ సినిమా మాత్రం ఫ్యాన్స్ లో కొత్త డౌట్స్ తో పాటు కొత్త ఉత్సాహాన్ని కూడా ఇస్తోంది. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలను కాదని.. ఓ యంగ్ స్టర్ తో సినిమాకు ముందుకు రావడంతో కచ్చితంగా ఈ కంటెంట్ తమకు నచ్చుతుంది అనుకుంటున్నారు. అదే టైమ్ లో సుజిత్ సాహో రిజల్ట్ ఫ్యాన్స్ ను భయపెడుతుంది.


డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్ర అనౌన్‌స్ మెంట్ పోస్టర్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉదయించే సూర్యుడిని చూస్తూ పవన్ కళ్యాణ్‌ నిలుచున్న పోస్టర్ వెనక ఆయన నీడగా ఓ గన్ కనిపిస్తోంది. అ౨లాగే డిఫరెంట్ సిటీస్ కూడా ఉన్నాయి. వీటితో పాటు పోస్టర్ లో జపానీస్ అక్షరాలూ ఉన్నాయి. అంటే ఈ కథలో జపాన్ కు సంబంధించిన ఓ కీలకమైన ఎపిసోడ్ ఉందని అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉందీ పోస్టర్.


ఇక ప్రస్తుతానికైతే కేవలం ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడుమొదలుపెడతారు.. హీరోయిన్ తో పాటు ఇతర కాస్ట్ అండ్ క్రూ మేటర్ ఏంటీ అనేది ఇంకా చెప్పలేదు.