ఏదైనా ప్రాజెక్ట్ లేట్ అయితే మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకు అసలులేట్ కావడానికి కారణం ఏంటీ అనేది తెలిస్తే దాన్ని పరిష్కరించుకుని ప్రాజెక్ట్ రీ స్టార్ట్ చేయొచ్చు. కారణం ఏంటో తెలిసీ.. అది ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనే క్లారిటీ లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు. కొన్ని రోజులు ఎదురుచూసి ఎవరి దారి వారు చూసుకుంటారు. చూసుకోవాలి కూడా. ఎందుకంటే సినిమా పరిశ్రమలో టైమ్ చాలా ఇంపార్టెంట్. కానీ అటువైపు స్టార్ హీరో ఉంటే నిర్ణయం త్వరగా తీసుకోలేరు. ప్రస్తుతం ఈ సంకట స్థితిలోనే ఉన్నాడు దర్శకుడు క్రిష్.
పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎమ్ రత్నం నిర్మాణంలో హరిహర వీరమల్లు అనే పీరియాడిక్ డ్రామా మొదలుపెట్టాడు క్రిష్. కానీ ఈ మూవీ ఏ టైమ్ లోనూ సజావుగా షూటింగ్ సాగలేదు. కారణం.. పవన్ ఎప్పుడూ ఇచ్చిన డేట్స్ కు కట్టుబడలేదు.. చెప్పిన టైమ్ కు రాలేదు అని నిర్మాణ సంస్థకు సంబంధించిన వాళ్లే చెబుతారు. ఓ దశలో ఈ మూవీ కోసం వేసిన సెట్స్ ఆరు నెలల పాటు ఖాళీగా ఉండిపోయాయి కూడా. ఇటు చూస్తే పవన్ బిజీగా ఉండటం వల్ల హరిహర వీరమల్లును ఆపాడా అంటే అదీ కాదు.
అతను ఈ మూవీ తర్వాత ఓకే చేసిన సినిమాలన్నీ చేస్తున్నాడు. మరి అందుకు కారణాలేంటనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ.. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్న క్రిష్ మాత్రం ఎప్పటికైనా పవన్ వస్తాడు అనే ఆశతనే ఉన్నాడు. అతని ఆశ తీరుతుందో లేదో కానీ.. ఇటు టైమ్ మాత్రం పోతోంది. మరి ఇకనైనా ఓ స్పష్టమైన క్లారిటీ తీసుకుని క్రిష్ నెక్ట్స్ స్టెప్ వేస్తే బెటర్ అనేది అతని సన్నిహితులు చెబుతున్న మాట. మరి పవన్ అయినా.. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏదో ఒకటి తేల్చేయొచ్చు కదా.. అనిపిస్తోంది కదూ.. నిజమే.. కానీ అలా అంటే ఆయన ఫ్యాన్స్ ఊరుకుంటారా..? సో.. డైరెక్టరే ఏదో ఒకటి తేల్చుకోవాలి.. అంతే.