ఈ మధ్య ఇండియాలో ఒక వర్గం హీరోలు చేస్తోన్న సినిమాలను బాయ్ కాట్ చేయాలంటూ పనీ పాటా లేని ఓ పనికిమాలిన బ్యాచ్ తెగ హడావిడీ చేస్తూ వస్తోంది. ఈ దేశంలో ఎవరైనా తాము చెప్పినట్టే వినాలని డిమాండ్స్ చేస్తూ.. ఎప్పటివో ఆయా హీరోల పాత వీడియోస్ ను పట్టుకుని హంగామా చేయడం మొదలుపెట్టిందీ గ్యాంగ్. వీళ్ల అదృష్టం వల్ల వారు అలా చెప్పిన సినిమాలన్నీ కంటెంట్ లేక బాక్సాఫీస్ వద్ద పోయాయి. దీంతో అదంతా తమ విజయమే అని తెగ ఫీలయ్యారు. బట్ గట్టి సినిమా పడితే బాయ్ కాట్ మాటలను బాక్సాఫీస్ వినదు అని లేటెస్ట్ గా వచ్చిన షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ ప్రూవ్ చేసింది.

మొదటి ఆటకే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందీ చిత్రం. ప్యాన్ ఇండియన్ లెవల్లో విడుదలైన పఠాన్ కు దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్ టాక్ వచ్చేసింది. రివ్యూస్ అన్నీ సూపర్ అంటున్నాయి. నిజానికి ఈ మూవీ విషయంలో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చాలా గొడవ చేశారు. బేషరమ్ పాటలో దీపికా వేసుకున్న బికినీ కలర్ గురించి రగడ చేశారు. చివరికి కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సిన స్థితి తెచ్చారు. ఓ చిన్న క్లాత్ కే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పుకున్నారు.


మొత్తంగా పఠాన్ విజయం ఈ బాయ్ కాట్ గ్యాంగ్ ను చెంపపెట్టులాంటిది అనుకోవచ్చు. ఇక చాలాకాలంగా కాస్త స్తబ్దుగా ఉన్న బాలీవుడ్ మార్కెట్ కు కూడా బాద్ షా కొత్త ఉత్సాహాన్ని తెచ్చాడు అంటున్నారు. షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత చేసిన కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ మూవీ. ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉంది. చివర్ లో వచ్చిన సల్మాన్ ఖాన్ ఎపిసోడ్ కు నార్త్ లో తెరకు చిరిగిపోతున్నాయి.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా పర్ఫెక్ట్ గాసెట్ అయిపోయింది. రేసీ స్క్రీన్ ప్లేకు తోడు ఈ బాయ్ కాట్ గ్యాంగ్ కు కావాల్సిన దేశభక్తి ఎపిసోడ్స్ కూడా ప్లస్ అయ్యాయి. దీపికా పదుకోణ్ పాత్ర బలంగాఉంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఇలాంటి భారీ యాక్షన్ సినిమాలు తీయాలంటే నా తర్వాతే ఎవరైనా అనేలా పఠాన్ తో మరోసారి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఏదేమైనా 2023ని బాలీవుడ్ పఠాన్ బ్లాక్ బస్టర్ తో గ్రాండ్ గా మొదలుపెట్టిందనే చెప్పాలి.