“నువ్వే నా ప్రాణం” సినిమా సమీక్ష

యూత్ ని బేస్ చేసుకుని తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా కమర్షియల్ హిట్ అవుతాయి. అందులోనూ కొంత మెసేజ్ వుండేలా తీస్తే… ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆదరిస్తారు. తాజాగా ఇలాంటి “నువ్వే నా ప్రాణం” సినిమానే తీశారు దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి.


ఇందులో కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే జంటగా నటించారు. దీనిని వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌ పతాకంపై శేషుదేవ రావ్‌ మలిశెట్టి నిర్మించారు. సుమన్, భానుచందర్‌, గిరి, యాంకర్ సోనీ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి.


కథ: సంజు(కిరణ్ రాజ్) సరదాగా తిరుగుతూ… గైనకాలజిస్టుగా పనిచేసే కిరణ్(ప్రియా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే కిరణ్ మాత్రం అతని ప్రేమను అంగీకరించదు. కానీ… సంజు మాత్రం కిరణ్ వెంటపడుతూ… ఆమె ప్రేమను పొందడానికి చాలా రకాలుగా ట్రై చేస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో సంజు సాధారణ యువకుడు కాదు… అతను కూడా ఓ బాధ్యతాయుతమైన పొజిషన్లో వున్న వ్యక్తి… పైగా ఎమ్మెల్యే ఆది శేషు(సుమన్) అని తెలుసుకుని… సంజుని ప్రేమించడం ప్రారంభిస్తుంది. అయితే.. కిరణ్ తండ్రి (భాను చందర్) కూడా సంజు తండ్రి ఆది శేషుకు మంచి మిత్రుడు కావడంతో… ఇద్దరికీ పెద్దల సమక్షంలో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లయిన తరువాత కిరణ్ పద్ధతిగా చీరలు కట్టుకోవడం సంజుకి అసలు ఇష్టం వుండదు. ఆమెను పొట్టి డ్రస్సుల్లో చూడాలని… పబ్ కు పోయి డిస్కో థెక్ లు వేయాలని బలవంతం చేస్తూ… మందు, సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఉన్నట్టుండి సంజు అలా ఎందుకు మారాడు? వీ