HomeLatestNTR : పవన్ కళ్యాణ్‌ ను దాటలేకపోయిన ఎన్టీఆర్

NTR : పవన్ కళ్యాణ్‌ ను దాటలేకపోయిన ఎన్టీఆర్

-

ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది కదా..? ముఖ్యంగా స్టార్ హీరోల బర్త్ డే లేదంటే ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే చాలు.. ఫ్యాన్స్ అంతా కలిసి ఆయా హీరోల పాత బ్లాక్ బస్టర్స్ ను మళ్లీ 4కేలో రీ ప్రింట్ చేయించి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక మామూలుగానే స్టార్ హీరోల కంటే వారి అభిమానుల మధ్య ఓ రేంజ్ లో వార్ జరుగుతుంది. అది కలెక్షన్స్ విషయంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా..? ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ కు తిరుగులేని స్టార్డమ్ ఇచ్చిన సినిమా ఖుషీ.

ఈ చిత్రాన్ని ఆ మధ్య విడుదల చేస్తే మొదటి రోజే రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఖుషీ మూవీ కలెక్షన్స్ 3 కోట్ల 62 లక్షలు. ఆ తర్వాత పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే ఈ మూవీ కూడా 2 కోట్ల 57లక్షల వసూళ్లు సాధించింది.

ఇక ఈ ట్రెండ్ లోకి మహేష్‌ బాబు ఫ్యాన్స్ ఒక్కడు చిత్రాన్ని కొత్త టెక్నాలజీకి అప్డేట్ చేసి విడుదల చేశారు. చాలామంది మహేష్‌.. పవన్ ను దాటేస్తాడా కలెక్షన్స్ లో అనుకున్నారు. బట్ ఈ మూవీ 1కోటి 90 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో అప్పట్లో అభిమానుల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది.


ఇక తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న సింహాద్రి చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. సింహాద్రి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్‌ రికార్డ్ ను కొట్టేస్తుంది అనుకున్నారు చాలామంది. అప్పట్లో ఖుషీ కంటే కూడా సింహాద్రి బిగ్గెస్ట్ హిట్. బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

అప్పటికి ఇంకా సరిగ్గా మీసాలు కూడా రాని ఎన్టీఆర్ నట విశ్వరూపానికి టాలీవుడ్ సైతం షాక్ అయిపోయింది. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన అలాంటి మూవీ రీ రిలీజ్ అంటే ఎక్స్ పెక్టేషన్స్ హై గానే ఉంటాయి కదా..? దీంతో ఖుషీ రికార్డ్ కనుమరుగవుతుందీ అనుకున్నారు. బట్ కాలేదు.
సింహాద్రి మూవీ రీ రిలీజ్ కలెక్షన్స్ పరంగా ఖుషీ కంటే కాస్త వెనకబడిపోయి ఉంది.

ఖుషీ మూవీ కలెక్షన్స్ 3 కోట్ల 62 లక్షలుగా ఉంటే సింహాద్రి 3 కోట్ల 45 లక్షలు మాత్రమే వసూలు చేసి పవన్ రికార్డ్‌ ను దాటలేకపోయింది. ఇక ఇలా చూసినా.. రీ రిలీజ్ ట్రెండ్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు ఎన్టీఆర్. ఒక్కోసారి అంతే.. అప్పట్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ అనిపించుకున్నా.. ఎప్పటికీ క్లాసిక్ అనిపించుకోలేవు. బట్ ఖుషీ కంప్లీట్ లవ్ స్టోరీ కాబట్టి ఈ తరానికీ బాగా కనెక్ట్ అయింది. అంతే తేడా.

ఇవీ చదవండి

English News