హాలీవుడ్ మూవీలో ఎన్టీఆర్-రామ్ చరణ్‌

ఒక్క హిట్టు వంద ప్రశంసలు, ఆశించిన అవార్డులూ తెస్తుందనీ అందరికీ తెలుసు. అయితే ఊహించని ఆఫర్ తేవడం మాత్రం అరుదు. పైగా ఈ మూవీలో ఉన్న ఇద్దరు హీరోలకూ ఇదే తరహా ఆఫర్ రావడం అంటే అదో రికార్డ్ కూడా. ఇద్దరు హీరోలు అంటే అర్థమైంది కదా.. ఇది ఆర్ఆర్ఆర్ గురించే అని. యస్.. ఈ మూవీలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌ లకు ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ వచ్చింది.

ఇక రాజమౌళి అయితే మేఘాల్లో తేలిపోతున్నాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకుందీ చిత్రం. ఆ ఆస్కార్ కూడా వచ్చేస్తే ఓ పనైపోతుందని అక్కడే ఉన్నాడు రాజమౌళి. అయితే లేటెస్ట్ గా ఓ కొత్త విషయం తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో కలిసి ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సినిమా చేయబోతోందట. అవును.. మన రామ్ భీమ్ లతో వేర్వేరుగా ప్రాజెక్ట్ లు సెట్ చేస్తున్నారట. మరి ఆ కథేంటో మనమూ తెలుసుకోవాలి కదా..?
ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ వేదికలపైనా అదరగొడుతున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్‌. ఈ ఇద్దరి నటనకూ వాల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఓ రకంగా ఒక ఇండియన్ మూవీ ఆర్టిస్టుల గురించి ఈ రేంజ్ లో చర్చ జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కూడా.

పైగా ఇద్దరు హీరోలు వెళ్లిన ప్రతి చోటా తమదైన శైలిలో మాట్లాడుతూ.. హ్యూమర్ తో పాటు ఇన్ఫర్మేషన్ ను కూడా అందిస్తుండటంతో సినిమాతో పాటు ఇంటర్వ్యూస్ లో వీరి టైమింగ్ కూడా అక్కడి జనాలను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఉత్తమ నటుడుగా ఆస్కార్ రేస్ లో ఉన్నాడు. వస్తుందా రాదా అనేది పక్కన బెడితే.. అక్కడి వరకూ వెళ్లడమూ గ్రేటే కదా..? రీసెంట్ గా ఈ మూవీలోని నాటు నాటు పాటకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చేసింది. ఈ పాటలో వీరి స్టెప్పులూ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాయి. ఎలా చూసినా ఇప్పుడు హాలీవుడ్ లోనూ వీరి పేరు మార్మోగిపోతోంది.

మరి ఇలాంటి క్రేజ్ ను క్యాష్‌ చేసుకోవడానికి ఏ ఇండస్ట్రీ అయినా ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుసు కదా..? ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ను అక్కడి ఓ పాపులర్ ఏజెన్సీ చూసుకుంటోంది. అది ఎంత ప్రభావంతంగా పనిచేస్తుందో అందరికీ అర్థమవుతోంది. ఇప్పుడు ఇదే ఏజెన్సీ ఈ ఇద్దరు హీరోలకూ చెరో సినిమా చేసేలా అక్కడి ప్రొడక్షన్ కంపెనీలకు ప్రపోజల్స్ పెడుతున్నాయట.

అందులో చాలా వరకూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారని టాక్. నిజానికి వీరిలో ఎవరితో సినిమా చేసినా అది ప్యాన్ వాల్డ్ మూవీగా వర్కవుట్ అవుతుంది. మరీ భారీ బడ్జెట్ పెట్టకపోయినా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ హీరోల సినిమాగా విడుదల చేయొచ్చు. కంటెంట్ కూడా బావుంటే కలెక్షన్ సునామీ వస్తుంది. మరి ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు ముందుగా హాలీవుడ్ ప్రాజెక్ట్ కు సైన్ చేస్తారో కానీ.. ఆర్ఆర్ఆర్ మన తెలుగు సినిమా జెండానే కాదు.. మన హీరోల రేంజ్ ను కూడా మార్చేసింది.

Related Posts