అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేస్తోన్న సినిమా దేవర మాత్రమే. మధ్యలో ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు టైమ్ పట్టింది. ఈ దేవర కోసం యేడాదికిపైగా వెయిట్ చేశాడు. దీంతో ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు దూకుడు పెంచుతున్నాడు. పైగా ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ఇమేజ్ కు అనుగుణంగానే ఈ దూకుడు కనిపించబోతోంది. అతని ప్లానింగ్ కూడా ఇమేజ్ ను మరింతగా పెంచుకునేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన దేవర ఫస్ట్ లుక్ అంచనాలు పెంచింది.
ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రం వచ్చే యేడాది మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే హృతిక్ రోషన్ తో చేయబోయే భారీ మల్టీస్టారర్ వార్2 ఇంకా స్టార్టే కాలేదు కానీ.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. యస్.. వార్ 2 రిలీజ్ డేట్ వచ్చింది.
యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించబోయే ఈ చిత్రానికి రీసెంట్ గా బ్రహ్మాస్త్రతో ఆకట్టుకున్న అయాన్ ముఖర్జీ దర్శకుడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ ఈ యేడాదే లాంచనంగా ప్రారంభం కాబోతుండటం విశేషం. ఈయేడాది నవంబర్ లేదా డిసెంబర్ లోనే పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటూ కుదిరితే ప్రశాంత్ నీల్ కంటే ముందే తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
2025 సంక్రాంతికి ఈ వార్2 విడుదల ప్లాన్ చేసుకుంది యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ. మామూలుగా యశ్ రాజు వాళ్లు ప్లాన్ చేశారంటే అది జరిగి తీరుతుంది అంతే. అందువల్ల దేవర వచ్చిన పది నెలల్లోనే వార్ 2 వస్తుంది. వార్ 2 రిలీజ్ అయిన తర్వాత 2025 సమ్మర్ లో ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ అవుతుంది. సో.. అలా కేవలం యేడాదిలోపే మూడు సినిమాలతో సందడి చేయబోతున్నాడు యంగ్ టైగర్.