Santhosh Sobhan : ఫ్యామిలీ, లవ్, ఎమోషన్.. అన్నీ మంచి శకునములే ట్రైలర్

సంతోష్ శోభన్(Santhosh Sobhan), మాళవిక నాయర్(Malavika Nair) జంటగా నందినిరెడ్డి(Nandini Reddy) డైరెక్ట్ చేసిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. నందిని రెడ్డి తరహా కథతో రూపొందిన ఈమూవీ ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr Jr) విడుదల చేశాడు.

ముందు నుంచీ వైవిధ్యమైన ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటోంది అన్నీ మంచి శకునములే మూవీ టీమ్.. స్వప్న సినిమాస్(Swapna Cinemas) బ్యానర్ పై సీతారామం తర్వాత అశ్వనీదత్ కూతుళ్లు నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ ను సొంతం చేసుకున్నారు.

రెండు కుంటుంబాల మధ్య ఉన్న ఈగోస్ వల్ల ఇబ్బంది పడ్డ ప్రమజంట కథలా కనిపిస్తోంది. జీవితంలో ఏదైనా కాసేపే ఉంటుందని అన్నీ ఈజీగా తీసుకునే హీరో.. డబ్బుల విషయంలో ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా ఉండే హీరోయిన్.

వీరి పరిచయం, ప్రేమ.. ఆ మధ్యలో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ట్రైలర్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ తరహా కథలు తెలుగులోచాలానే వచ్చినట్టు కనిపిస్తున్నా.. టేకింగ్ పరంగానూ.. క్యారెక్టరైజేషన్స్ లోనూ నందినిరెడ్డి ముద్ర ఉంది. అదే సినిమాకు ప్లస్ అవుతుందనిపిస్తోంది.


ఇలాంటి సినిమాలకు ఓపెనింగ్స్ ను ఎక్స్ పెక్ట్ చేయడం కష్టమే. కానీ సినిమా నిజంగానే బావుంటే మౌత్ టాక్ తో ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఏదేమైనా ఓ బేబీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నందినీ రెడ్డి ఈ మూవీతో మరోసారి ప్రూవ్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. అన్నట్టు ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతోంది.

Related Posts