పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా ఎప్పుడో ఎంతో సాధించేశాడు. కానీ పొలిటీషియన్ గా మాత్రం ఇంకా బిగినెంట్ స్టేజ్ లోనే ఉన్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తున్నాడు. మరోవైపు సినిమాల పరంగానూ దూకుడుగానే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ వకీల్ సాబ్, ఈ ఏడాది భీమ్లా నాయక్ లతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం క్రిష్‌ డైరెక్షన్ లో హరిహరవీరమల్లు సినిమా చేస్తున్నాడు. తర్వాత సుజిత్ డైరెక్షణ్ లో సినిమా ఉంటుంది. సినిమాలతో పాటు పాలిటిక్స్ కు కూడా టైమ్ కేటాయిస్తున్నాడు. అయితే పాలిటిక్స్ అంటే సినిమాల్లా ప్లానింగ్ చేసుకుని షెడ్యూల్స్ వేసుకుని ఉండవు కదా.. సడెన్ గా ఏదో ఒక ఇష్యూ వస్తుంది. ఈయన వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఆ కారణంగానే సినిమాలు లేట్ అవుతున్నాయి. కాకపోతే రాబోయే ఎలక్షన్స్ ను ఈసారి సీరియస్ గా తీసకున్నాడు పవన్ కల్యాణ్‌. అందుకే ఎన్నికలకు చాలా రోజుల ముందుగానే ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నాడు.

ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వాహనం తయారు చేయించుకున్నాడు.
తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ కూడా చైతన్య రథం అనే ప్రత్యేక వాహనం తయారు చేయించుకుని.. రాష్ట్రమంతా తిరిగి ప్రజాబలం సంపాదించి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ కూడా ఎన్టీఆర్ లాగానే స్పెషల్ వెహికిల్ రెడీ చేయించాడు. దీని గురించి రీసెంట్ గానే వార్తలు వచ్చాయి. అయితే బండి రెడీ అయిందంటూ పవన్ కళ్యాణ్‌ స్వయంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. విశేషం ఏంటంటే ఈ వాహనానికి “వారాహి” అనే పేరు కూడా పెట్టాడు పవన్ కళ్యాణ్‌. దీనికి వారాహి ఈజ్ రెడీ ఫర్ ఎలెక్షన్ బ్యాటిల్ అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేశాడు. మొత్తంగా ఇప్పుడీ వారాహి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది.