ఎన్ని అంచ‌నాల‌తో వ‌చ్చినా.. అంత‌కు మించి బంగార్రాజు ఉంటుంది – నాగార్జున‌

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్యల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం బంగార్రాజు. ఇందులో నాగార్జున స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తే.. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి న‌టించింది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రానికి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా బంగార్రాజు మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. అభిమానులందరినీ ఇక్కడకు పిలవలేకపోయాం. అందరూ క్షమించండి. జనవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోకు అది చాలా ముఖ్యమైన తేది. అదే రోజును అన్నపూర్ణ పుట్టింది. దసరా బుల్లోడు అనే సినిమాతో యాభై ఏళ్ల క్రితం నాన్న గారు సంక్రాంతికి దుమ్ములేపారు. అది కూడా మ్యూజికల్ హిట్. సక్సెస్ మీట్‌లో అందరికీ థ్యాంక్స్ చెబుతాను. సినిమాకు సగం సక్సెస్ మ్యూజిక్. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం.

చక్కటి మాస్ కమర్షియల్ సాంగ్ ఇచ్చారు. ప్రతీ సాంగ్ ఓ వజ్రంలా ఉంటుంది. సూపర్ హిట్ ఆల్బమ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది. బంగార్రాజు సినిమాకి ఎన్ని అంచ‌నాల‌తో వ‌చ్చినా.. అంతకన్నా ఎక్కువే ఉంటుంది. జనవరి 11న ట్రైలర్ రాబోతోంది. జనవరి 14న పండుగ రోజున పండుగలాంటి సినిమాను తీసుకొస్తున్నాం. అందరూ ఆదరించండి అని అన్నారు.

Related Posts