ఆలియాతో ఆడుకుంటున్న నెటిజ‌న్స్. ఇంత‌కీ ఏమైంది..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ ప్రాజెక్టు గా రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ఇందులో చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తే.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ సీత‌గా న‌టించింది. ఈ సినిమా ద్వారా ఆలియా భ‌ట్ టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతుంది. సంక్రాంతి కానుక‌గా ఆర్ఆర్ఆర్ జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.

ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ ద్వారా టాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతున్న ఆలియాను నెటిజ‌న్స్ ఆడుకుంటున్నారు. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే… అలియాభట్ నీ నవ్వు ఫేక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఓ వీడియోని వైరల్ చేస్తూ సోష‌ల్ మీడియాలో అలియాని ఆడుకుంటున్నారు. ఇలా ట్రోల్ చేయ‌డానికి కార‌ణం ఏంటంటే.. ఇటీవల అలియా భట్ ఓ ఈవెంట్ లో మీడియా ఫొటోగ్రాఫర్లు అడ‌గ‌డంతో ఫొటోలకు పోజులిచ్చింది. ఈ వీడియోని ఫొటోగ్రాఫర్ భయాని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశారు.

ఇందులో రక రకాల ఫోజులు ఇచ్చింది. ఆ స్టిల్స్ ఇస్తున్నప్పుడు అలియా పగలబడి నవ్వుతూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్ లు ఆమెది ఫేక్ స్మైల్ అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. గతంలో దీపికా పదుకునేది ఫేక్ స్మైల్ అంటూ అలియా విమర్శలు చేసింది. అందుక‌నే అలియా భట్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. అయితే.. ఆలియాను ఇలా ట్రోల్ చేస్తున్న వారి పై ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు. మ‌రి.. ఆలియా స్పందిస్తుందేమో చూడాలి.

Related Posts