బాలకృష్ణ సినిమాపై నెగెటివ్ పబ్లిసిటీయా.. ?

నందమూరి బాలకృష్ణ.. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో అఖండతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ మూవీ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనుకున్న వారికి క్రాక్ దర్శకుడికి డేట్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. 2021 సంక్రాంతి బరిలో నిలిచి క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సో ఈ కాంబినేషన్ కరెక్టే అని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు.

పైగా గోపీచంద్ బాలయ్యకు ఫ్యాన్ కూడానట. దీంతో తన అభిమాన హీరోను ఎలా చూపిస్తాడా అనే ఆసక్తి మిగతా అభిమానుల్లోనూ ఉంది. ఎప్పట్లానే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించి ప్రతిదీ హైలెట్ గానే నిలుస్తోంది. ఇప్పటికే వచ్చిన మూడు పాటలూ ఆకట్టుకున్నాయి. మూడో పాటలో బాలయ్య స్టెప్పులకు బలే స్పందన వచ్చింది. టీజర్ సైతం రోరింగ్ గా అనిపించింది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా దునియా విజయ్ విలన్ గా నటిస్తోన్న ఈ వీరసింహారెడ్డిపై రోజు రోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

అయితే జనవరి 12న విడుదలువుతోన్న ఈ చిత్రంపై కొందరు కావాలనే నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. అటు మెగాస్టార్ సినిమా వాల్తేర్ వీరయ్య జనవరి 13న విడుదల అవుతుండటమే ఈ అనుమానాలకు కారణం. బట్ ఈ అనుమానాల్లో నిజమెంత అనేది చూస్తే అంతా ఫూలిష్ అనిపిస్తుంది.


నిజానికి ఇద్దరు పెద్ద హీరోలు బాక్సాఫీస్ వార్ లో దిగితే ఆ హీట్ ఏ రేంజ్ లో ఉంటుందో మేకర్స్ కే తెలుసు. అయితే ఇక్కడ చిత్రాలకు బ్యానర్, నిర్మాతలు ఒక్కరే. మైత్రీ మూవీస లో వస్తున్నాయీ చిత్రాలు. వీరు చిరంజీవి వాల్తేర్ వీరయ్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అని చెప్పేవారూ ఉన్నారు. కానీ మెగా టీమ్ ప్రమోషన్స్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకోవడం వల్లే వీర సింహారెడ్డి కంటే వీరయ్య గురించే జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అనేది మెగా టీమ్ చెబుతోన్న మాట.

ఇక రీసెంట్ గా బాస్ పార్టీ సాంగ్ సెట్ లో చేసిన ప్రెస్ మీట్ కూడా బాగా హిట్ అయింది. అలాంటిది బాలయ్య సినిమాకు లేదు అనే లోటును కూడా ఫీలవుతున్నారు నందమూరి అభిమానులు. అందుకోసం ట్రైలర్ లాంచింగ్ ను వేదికగా చేసుకోవాలనేది నిర్మాతల ఆలోచన. అలా చూసినా.. వీర సింహారెడ్డి కంటే ముందే వీరయ్య ట్రైలర్ వస్తోంది.


యస్.. వీర సింహారెడ్డి ట్రైలర్ ను జనవరి 6న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు డేట్, టైమ్, ముహూర్తం అన్నీ ఫిక్స్ అయ్యాయి. వారు ఫిక్స్ అయిన తర్వాత వారికంటే ముందే వాల్తేర్ వీరయ్య ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. జనవరి 4నే వీరయ్య ట్రైలర్ రాబోతోంది. సో.. ఇలా ప్రమోషన్స్ తో పోటీ పడుతూ వీరయ్య టీమ్ దూసుకుపోతోంది. ఆ విషయంలో కాస్త స్తబ్దుగా ఉన్న బాలయ్య టీమ్ వెనకబడింది తప్ప.. ఇక్కడ నెగెటివిటీ అంటూ ఏం లేదు అనేది విశ్లేషకుల అంచనా. అవన్నీ ఎలా ఉన్నా.. అసలు వార్ లో పై చేయి ఎవరిది అవుతుందో వారే కదా సంక్రాంతి విన్నర్.

Related Posts