NC 22 ప్రీలుక్ రిలీజ్, రేపు ఫస్ట్ లుక్ విడుదల

నాగ చైతన్య – వెంకట్ ప్రభు, శ్రీనివాస చిట్టూరి, NC 22 ప్రీలుక్ రిలీజ్, రేపు ఫస్ట్ లుక్ విడుదల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్ లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. NC22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగానటిస్తోంది. నాగ చైతన్య కెరీర్ లో అత్యంత భారీ చిత్రాల్లో NC 22 ప్రాజెక్ట్ ఒకటి.

తారాగణం, అద్భుతమైనసాంకేతిక విభాగం ప్రకటనతో ఈ చిత్రం భారీ బజ్ను క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ స్టన్నింగ్ ప్రీ లుక్ తో అభిమానులను, సినీ ప్రేమికులను సర్ ప్రైజ్ చేశారు. ప్రీ-లుక్ లో నాగ చైతన్య పోలీస్ అవతార్ లో ఫెరోషియస్ లుక్ లో కనిపించారు.

నాగచైతన్య తోటి అధికారుల చేతుల్లో లాక్ చేయబడినట్లు కనిపిస్తున్నాడు. అతని ఆవేశాన్ని అదుపు చేయడానికి తుపాకీలను కూడా గురిపెట్టడం గమనించవచ్చు. ఈ ఇంటెన్స్ లుక్.. ఫస్ట్ లుక్ పై అంచనాలను పెంచింది. ఫస్ట్ లుక్ నవంబర్ 23 తేది ఉదయం 10:18 గంటలకు చైతన్య పుట్టినరోజు సర్ ప్రైజ్గా విడుదల కానుంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు

Related Posts