నవీన్ పోలిశెట్టి.. నిజంగా అంత సీన్ ఉందా..?

వరుసగా రెండు విజయాలు సాధించాడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో పాటు జాతిరత్నాలుతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. జాతిరత్నాలు 2021లో వచ్చింది. సిల్లీ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఆ మూవీ తర్వాత మనోడు మరో సినిమా చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. మధ్యలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించే సినిమాలో ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ బాగా ఆలస్యం అవుతోంది.

అసలు షూటింగ్ జరుగుతుందా లేదా అనే అప్డేట్ కూడా చాలా కాలం రాలేదు. రీసెంట్ గా అనుష్కతో పాటు నవీన్ బర్త్ డేస్ కు ఫస్ట్ లుక్ పోస్టర్స్ వదిలారు. దీంతో ప్రాజెక్ట్ అయితే ఉంది అనిపించుకుంది. ఇక లేటెస్ట్ గా 2022కు వీడ్కోలు, 2023కి వెల్కమ్ చెబుతూ నవీన్ పోలిశెట్టి ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ వరకూ ఉన్న జనం ఈగర్ గా ఎదురుచూస్తున్నారనీ..

ఎవరు చూసినా అతని కొత్త సినిమా సంగతి తేల్చమని అడుగుతున్నట్టుగా ఉందీ వీడియో. వీడియోగా చూడ్డానికి కాస్త ఫన్నీగానే ఉంది. కానీ నిజానికి నవీన్ కోసం జనం ఆ రేంజ్ లో ఆత్రంగా ఎదురుచూస్తున్నారా అంటే ఖచ్చితంగా అవును అని మాత్రం చెప్పలేం.


ఇప్పటికే ఈ యేడాది తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఈ లిస్ట్ లో అతను ఉంటే చూస్తారు తప్ప.. అతను ఉండాల్సిందే అని పట్టుపట్టేంత సీన్ ఏ నటుడుకీ ఉండదు. ఉందీ అనుకుంటే అది అతని భ్రమ. ఎవరి కెరీర్ ను వారు మలచుకుంటారు. ఆ క్రమంలో వారు వేగంగ సినిమాలు చేస్తారా లేదా అనేది వారి ఇష్టం. అంతే కానీ..

అబ్బో వారికోసం జనం పడిచచ్చిపోయేంతలా ఎదురుచూస్తున్నారు అని వారికి వారే అనుకుని ఏకంగా వీడియోలు చేయడం మాత్రం ఇయర్ ఎండింగ్ లో కాస్త ఓవర్ గా ఉంది. సో.. నవీన్.. నువ్వు సినిమా చేస్తే.. అది విడుదలై.. బావుందనుకుంటే జనం చూస్తారు. అంతే కానీ నువ్వు సినిమా చేసేంత వరక మరో సినిమా కూడాకుండా మాత్రం ఉండరు.

Related Posts