జెర్సీ చిత్రానికి గాను జాతీయ అవార్డ్ అందుకున్న నిర్మాత నాగవంశీ
Latest Movies Tollywood

జెర్సీ చిత్రానికి గాను జాతీయ అవార్డ్ అందుకున్న నిర్మాత నాగవంశీ

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఢిల్లీలో జరిగాయి. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇటీవల సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు.

తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా జెర్సీ ఎంపికైన విషయం తెలిసిందే. నాని నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వసూలు చేయడంతో పాటు విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి గాను నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి అవార్డు అందుకున్నారు. జెర్సీ చిత్రానికి గాను ఎడిటర్ నవీన్ నూలి కూడా అవార్డ్ అందుకున్నారు. ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహర్షి ఎంపికైంది. ఈ చిత్రానికి గాను డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

Post Comment