సమంతతో విడాకుల గురించి ఎట్టకేలకు స్పందించిన నాగచైతన్య
Latest Movies Tollywood Trending News

సమంతతో విడాకుల గురించి ఎట్టకేలకు స్పందించిన నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య, సమంత మధ్య విభేదాలు రావడం.. విడిపోతున్నారని వార్తలు రావడం తెలిసిందే. మొదటి ఈ వార్తలు రూమర్స్ అనుకున్నారు. ఆతర్వాత ఇది నిజమా..? అని ఆలోచనలో పడ్డారు. ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారు అభిమానులు. రోజురోజుకు ఈ విడాకుల వార్తలు సంచలనంగా మారుతున్నాయి. సమంత సోషల్ మీడియాలో బాధాకరమైన పోస్టులు పెట్టడం.. సింగిల్ గా చెన్నైలో ఉండడం.. తిరుపతి వెళ్లినప్పుడు ఈ వార్తల గురించి అడిగితే.. జర్నలిస్ట్ పై ఫైర్ అవ్వడం తెలిసిందే.

లవ్ స్టోరీ ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు వచ్చిన నాగచైతన్య పర్సనల్ ప్రశ్నలు అడగవద్దు అని చెప్పడంతో విడాకుల వార్తలు నిజం అనే నమ్మకం కలుగుతుంది అంటున్నారు. ఇదిలా ఉంటే.. లవ్ స్టోరీ ప్రమోషన్లో భాగంగా ఇంగ్లీషు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో విడాకుల మ్యాటర్ పై ఓపెన్ అయ్యాడు. తనకి సోషల్ మీడియాతో అంతగా అటాచ్మెంట్ ఉండదని.. కానీ తెలిసిన వారు ఈ సోషల్ మీడియా గాసిప్స్ పై చెప్పినప్పుడు చాలా బాధేస్తుందని.. నేను వైరల్ వార్తలను అంతగా పట్టించుకోనని చెప్పాడు. ఇక సోషల్ మీడియాపై స్పందిస్తూ.. మొదట్లో మీడియా కవరేజ్ విషయంలో చాలా మార్పులు చూస్తున్నామని చైతూ అన్నారు.

వార్తలను ప్రసారం చేయడానికి ఒకప్పుడు మ్యాగజైన్స్ ఉండేవి కానీ.. నేడు డిజిటల్ మీడియా వచ్చాకా.. వార్తలు వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయని.. దీంతో ప్రజలకి చాల మంచి జరుగుంతుందని చెప్పాడు. అయితే… ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఈ మధ్య తన పర్సనల్ లైఫ్ గురించి అతిగా స్పందిస్తుందని.. నా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా కవర్ చేయటం భాదేస్తుందని చెప్పాడు చైతు. అయితే ఫస్ట్ లో కాస్త ఇబ్బందిగా ఫీలైనా.. రాను రాను అలాంటి వాటిని పట్టించుకోవడం మానేశానని అన్నారు కానీ.. అసలు విషయం మాత్రం బయటపెట్టలేదు.

Post Comment