నా ఫస్ట్ హీరోనే ఆల్వేస్ బెస్ట్ – రాజమౌళి

ఇండియాలో టాప్ యాక్టర్ ఎవరూ అని ఓ టాప్ డైరెక్టర్ ను అడిగితే ఏం చెబుతాడు. పైగా ఈయన ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను క్రియేట్ చేసిన డైరెక్టర్ అని కూడా చెప్పుకుంటున్నాం. అంటే రాజమౌళి అని అర్థం అయింది కదా.. రీసెంట్ గా తను ఆర్ఆర్ఆర్ తో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతే కాదు.. ఈ మూవీని ఏకంగా ఆస్కార్ బరిలో నిలపడంలోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. అలాంటి రాజమౌళిని ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎవరూ అంటే ఏం చెప్పాడో తెలుసా..?


అపజయం అనే మాటను దాటుకుని అప్రతిహతంగా దూసుకుపోతోన్న ఏకైక దర్శకుడు రాజమౌళి. ఇన్నేళ్ల కెరీర్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా అన్నీ కమర్షియల్ హిట్సే. సినిమా సినిమాకూ తనతో పాటు తెలుగు సినిమా రేంజ్ ను కూడా మార్చుకుంటూ వెళ్లిన రాజమౌళి ఇప్పుడు ఇండియాస్ టాప్ డైరెక్టర్ గా మారాడు అంటే కారణం తన ప్యాషనే. మగధీరతో ఫస్ట్ టైమ్ భారీ బడ్జెట్ మూవీ చేశాడు. అదే రేంజ్ లో హిట్అందుకన్నాడు.

తర్వాత ఈగతో ఇండియాను తన గ్రాఫిక్స్ తో మాయ చేశాడు. ఇక బాహుబలితో తెలుగు సినిమాను ఇండియన్ సినిమాగా మార్చి ప్రపంచం ముందు గర్వంగా నిలుచున్నాడు. బాహుబలి రెండు భాగాలూ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఓ జానపద కథకు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫికల్ హంగులను అద్ది ఆ చిత్రాన్ని అజరామరం చేశాడు. ఇక రీసెంట్ తెలుగు టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అంటూ భారీ మల్టీస్టారర్ తో మరో బ్లాక్ బస్టర్ బ్యాగ్ చేసుకున్నాడు.

ఈ మూవీ తర్వాత ఇద్దరు హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు వచ్చింది. ప్యాన్ ఇండియన్ రేంజ్ లో పెద్ద మార్కెట్ క్రియేట్ అయింది. వీరి నటనకు ప్రపంచం మరోసారి అబ్బురపడిపోయింది. అందుకే ఆస్కార్ వరకూ వెళ్లారు. అయితే లిస్ట్ లో ముందుగా వెళ్లాడు ఎన్టీఆర్. వెరైటీ ఆస్కార్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ లో టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్.

రీసెంట్ గా ఈ మూవీని కమిటీ కోసం స్క్రీనింగ్ చేశారు. ఆ స్క్రీనింగ్ తర్వాత మీ కెరీర్ లో బెస్ట్ యాక్టర్ ఎవరూ అడిగారు అక్కడ. దానికి రాజమౌళి.. ” ఎన్టీఆర్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్. ఖచ్చితంగా అతనో బెస్ట్ పర్ఫార్మర్. ఇన్నాళ్ల నా కెరీర్ లో నేను చూసిన అత్యుత్తమ నటుడు నా ఫస్ట్ హీరోనే.

ఇప్పటి వరకూ నా అన్ని సినిమాల్లోనూ నేను చిత్రీకరించిన బెస్ట్ షాట్ కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనే. అతని కనుబొమలపై కెమెరా పెట్టినా ఓ ఎమోషన్ ను పలికించగలడు”.. అంటూ తన ఫస్ట్ హీరో ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు రాజమౌళి. అయితే సినిమాలో రామ్ చరణ్‌ కూడా ప్రస్తుతం ఆస్కార్ కు సంబంధించి ఆర్ఆర్ఆర్ మూవీ రిప్రెజెంట్ గా న్యూ యార్క్ లోనే ఉన్నాడు. మరి అతని గురించి ఏం చెప్పకపోవడం ఆశ్చర్యం.

Related Posts