ఇద్దరు స్టార్ డైరెక్టర్ ల దగ్గరకు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ప్రపోజల్స్
Latest Movies Tollywood

ఇద్దరు స్టార్ డైరెక్టర్ ల దగ్గరకు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ప్రపోజల్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు..? ఈ ప్రశ్నకు నందమూరి అభిమానులను గత కొంతకాలంగా సమాధానం దొరకడం లేదు. సమాధనం ఎప్పుడు దొరుకుతుందో కూడా క్లారిటీ లేదు. అదేంటి.. మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య చెప్పారు కదా అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే.. బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెబుతూనే ఉన్నారు కానీ.. ఇంతకీ ఎప్పుడు ఉంటుంది అని అడిగితే.. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 సినిమా ద్వారా ఉంటుంది అని చెబుతున్నారు. మరి.. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అంటే.. అది చాలా ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్. టైమ్ పడుతుంది అని చెబుతున్నారు కానీ.. ఎప్పుడు ఉంటుందో క్లారిటీగా చెప్పడం లేదు.

దీంతో నందమూరి అభిమానుల్లో కూడా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ మొదటి చిత్రాన్ని నిర్మించాలి చాలా మంది నిర్మాతలు బాలయ్యను సంప్రదించారట. అలాగే డైరెక్టర్ ని కూడా ఫిక్స్ చేశారట కానీ.. బాలయ్య మాత్రం ఆదిత్య 999 ద్వారానే జరగాలి అని చెబుతున్నారట. దీనికి తోడు ఆమధ్య మోక్ఝజ్ఞ ఫోటోలు బయటకు రావడం.. అందులో కాస్త లావుగా కనిపించడంతో మోక్షజ్ఞకు హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలయ్య మోక్షజ్ఞను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడితే.. ఆదిత్య 999 సినిమానే చెబుతున్నారు. నిజంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి సీరియస్ గా ఉంటే.. పూరితోనో, యంగ్ డైరెక్టర్స్ మలినేని గోపీచంద్ తోనో, అనిల్ రావిపూడితోనే సినిమా చేయంచవచ్చు. అలా చేయకపోవడానికి కారణం అదే అంటున్నారు. నిజంగానే మోక్షజ్ఞకి సినిమాలపై ఇంట్రస్ట్ లేదా..? ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవాలా..? లేక పుకార్లా..? అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది..? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Post Comment