Latest Movies

మణిరత్నం కూడా రాజమౌళి రూట్ లోనే

ఇండియాస్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు మణిరత్నం. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గా ఆయనది ఇంటర్నేషనల్ రేంజ్. కమర్షియల్ గానూ ఎన్నో విజయాలు సాధించారు. కానీ కొన్నాళ్లుగా సరైన హిట్ పడటం లేదు. ఈ నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ అనే హిస్టారికల్ మూవీతో రాబోతున్నాడు. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, జయం రవి, త్రిష, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, శోభిత ధూలిపాళ్ల వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యం అవుతోన్న ఈ చిత్రం నుంచి ఓ కీలకమైన అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశాడు కార్తీ. మొన్నటి వరకూ ఈ చిత్రం ఒకే భాగం అనుకున్నారు. కానీ రెండు భాగాలుగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ‘పి.ఎస్ -1’అనే పోస్టర్ విడుదల చేశాడు. అంటే రెండో భాగం కూడా ఉంటుందనే కదా అర్థం. మొత్తంగా లేట్ అయినా రెండు భాగాలతో ఎంటర్టైన్ చేయబోతున్నాడన్నమాట మణిరత్నం.

Post Comment