అరుదైన పదవిలో మంగ్లీ

అదృష్టాన్ని నమ్ముతారు కొందరు. శ్రమనే నమ్ముకుని ముందుకు సాగుతారు ఇంకొందరు. వీరు సాగించే ప్రయాణం అంత సులువుగా ఉండదు. సమాజం నుంచి అనేక సమస్యను, సవాళ్ళను దాటుకుని రాతిదేలాలి. అప్పుడు కానీ అందలం దక్కదు.

ఒక టివి ఛానల్ లో చిన్న యాంకర్ గా జర్నీ స్టార్ట్ చేసి.. యాస కానీ యాస లో ఆట్టుకుంటూ.. అంది వచ్చిన పాటల అవకాశాలను అందిపుచ్చుకుని.. అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో కూడా సింగర్ గా తన ముద్రను బలంగా చాటుకుని సత్తా చాటిన గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి.

ఇన్నేళ్ల తన శ్రమకు ఫలితంగా ఇప్పుడు తనకు ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ డైరెక్టర్ పదవి వరించింది.నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది సత్యవతి.అంటా అనుకునేట్టు తనది తెలంగాణ కాదు. ఆంధ్ర ప్రదేశ్లోని అనంత పురం జిల్లా గుత్తి మండలంలో ఉన్న బసినే పల్లి తాండ.


అక్కడినుంచి మొదలైన తన ప్రస్థానం ఇప్పుడు ఏడుకొండల వాడి సేవకు దగ్గరగా వచ్చింది.
SVBC డైరెక్టర్ హోదానా లేక ఇంకేదైనా ఉందా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్నా .. తన ప్రయాణం.. ప్రస్తానం ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తుంది అనడంలో సందేహమే లేదు.