Major : బుల్లితెరపై మేజర్ డిజాస్టర్.. కారణం ఇదేనా..?

వెండితెరపై బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు బుల్లితెరపైనా ఆ ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రమే మిస్ ఫైర్ అవుతుంటాయి. బట్ ఈ రేంజ్ లో మిస్ ఫైర్ కావడం మాత్రం ఎవరూ ఊహించనిది. 27/11 అటాక్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ”మేజర్”. మేజర్ సందీప్ ఉన్ని ముకుందన్ కథనే కీలకంగా చెప్పిన సినిమా. దర్శకుడు శశికిరణ్‌ టిక్కా. రచన హీరో అడవి శేష్‌. దేశవ్యాప్తంగా అద్భుతమై అప్లాజ్ తెచ్చుకుందీ చిత్రం. అతి తక్కువ బడ్జెట్ తో ఓ రేంజ్ విజువల్‌స్ తో మెప్పించాడు దర్శకుడు. ఆ టైమ్ లో కంట్రీస్ మోస్ట్ అవెయిటెడ్ అనిపించుకున్న సినిమా ఈ ”మేజర్.


అలాంటి సినిమా బుల్లితెరపై ఫస్ట్ టైమ్ వస్తే.. ఏ రేంజ్ రేటింగ్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ ఈ మూవీ పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. అర్బన్ ఏరియాల్లో 1.87 రేటింగ్ వస్తే.. రూరల్ ఏరియాస్ లో 1.70 మాత్రమే వచ్చింది. మామూలుగా ఇలాంటి సినిమాలకు మంచి రేటింగ్ వస్తుందనుకుంటారు చాలామంది. అందుకు భిన్నంగా పూర్ రేటింగ్ రావడం మేకర్స్ ను కూడా సర్ ప్రైజ్ చేసింది.

అయితే ఈ చిత్రానికి టివిల్లో రేటింగ్ రాకపోవడానికి కారణాలు రెండు చెబుతున్నారు. ఒకటి ఆల్రెడీ ఎప్పుడో ఓటిటిల్లో వచ్చేయడంతో పాటు సినిమా విడుదలైన దాదాపు ఏడాది తర్వాత టివిల్లోకి రావడం. ఈ రెండు రీజన్స్ తోనే మేజర్ కు మేజర్ రేటింగ్ రాలేదని మేకర్స్ తో పాటు విశ్లేషకులూ అంచనా వేస్తున్నారు. సో.. దేశభక్తి అయినా గ్యాప్ వస్తే అంతే అన్నమాట.

Related Posts