బుల్లితెర పై ఎన్టీఆర్ తో కలిసి సందడి చేయనున్న మహేష్‌
Latest Movies Reality shows Small Screen Tollywood

బుల్లితెర పై ఎన్టీఆర్ తో కలిసి సందడి చేయనున్న మహేష్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ స్ర్కీన్ కోసం ఆర్ఆర్ఆర్ చేస్తుంటే.. స్మాల్ స్ర్కీన్ కోసం ఎవరు మీలో కోటీశ్వరులు అనే పొగ్రామ్ చేస్తున్న విషయం తెలిసిందే. బుల్లితెర పై గత కొన్ని రోజులుగా సందడి చేస్తూ ఎన్టీఆర్ విశేషంగా ఆకట్టుకుంటున్నారు. రికార్డ్ టీఆర్పీతో ఈ రియాల్టీ షో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతుంది. వారం వారం రేటింగ్ లో రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ షో ద్వారా మరింత వినోదం మరింత విజ్ఞానం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే… దర్శకధీరుడు రాజమౌళి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ ఇద్దరినీ ఈ షోకు ఎన్టీఆర్ పిలవడం ఓ ఎపిసోడ్ చేయడం తెలిసిందే.

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు రంగంలోకి దిగారు. అవును.. ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం సూపర్ స్టార్ మహేష్‌ బాబు వస్తున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ సీటులో.. మహేష్‌ బాబు గెస్ట్ సీటులో కూర్చొని ఈ పొగ్రామ్ చేయడం జరిగింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అటు మహేష్‌ బాబు అభిమానులు ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఈ పొగ్రామ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మహేష్‌ ని అన్నా అని పిలుస్తారు.

ఆ అనుబంధం కారణంగానే మహేష్‌ బాబు భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మహేష్‌ బాబు ఈ షోకు వస్తుండడం విశేషం. ఈ క్రేజీ ఎపిసోడ్ ను అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్ లో షూట్ చేశారు. అలాగే ఈ ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా వచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ని మేకర్స్ దసరా కానుకగా టెలికాస్ట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎపిసోడ్ తో భారీ టీఆర్పీ రావడం మాత్రం గ్యారంటీ అని అంటున్నారు. మరి.. ఎన్టీఆర్ – మహేష్‌ కలిసి చేసిన ఈ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ లో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Post Comment