మెగా బ్యానర్ కి షాక్ ఇచ్చిన మహేష్‌
Latest Movies Tollywood

మెగా బ్యానర్ కి షాక్ ఇచ్చిన మహేష్‌

బాహుబలి సినిమా కనీవినీ ఎరుగని విధంగా వసూలు చేసి చరిత్ర సృష్టించడంతో.. పాన్ ఇండియా సినిమా ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. వందల కోట్లతో సినిమా తీస్తే.. అంతకు మించి అనేలా వసూలు చేయచ్చు అనే నమ్మకాన్ని బాహుబలి సినిమా కల్పించింది. దీంతో వరుసగా పాన్ ఇండియాలు రూపొందుతున్నాయి. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. రామాయణం నేపధ్యంలో భారీ సినిమా నిర్మించాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు.. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అల్లు అరవింద్, మధు మంతెన సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు. ఈ సినిమా గురించి కొన్నేళ్ల కింద‌టే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డంలో ఆల‌స్యం జ‌రుగుతోంది.

అయితే.. ఈ ఏడాది చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికి చూస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్ప‌టికే కొన్ని ఊహాగానాలు న‌డిచాయి. నిర్మాత‌ల్లో ఒక‌రైన మ‌ధు మంతెన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ద‌స‌రాకు ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూను ప్రకటిస్తామన్నారు.. ఇక అప్ప‌టి నుంచి ఈ సినిమాలో ముఖ్య తారాగ‌ణం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. హృతిక్ రోష‌న్, దీపికా ప‌దుకొనే ఈ రామాయ‌ణం సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌న టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సైతం ఓ కీల‌క పాత్ర చేస్తాడ‌ని టాక్ వినిపించింది.

తాజా సమాచారం ప్ర‌కారం.. మ‌హేష్ ఈ సినిమాకు నో చెప్పేశాడ‌ట‌. అత‌ణ్ని ఈ సినిమాకు సంప్ర‌దించ‌డం వాస్త‌వ‌మే అని.. అయితే ఈ చిత్రానికి బ‌ల్క్ డేట్లు ఇవ్వాల్సి ఉండ‌టం, రాజ‌మౌళితో చేయాల్సిన సినిమాతో క్లాష్ అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో మ‌హేష్ ఈ ప్రాజెక్టుకు నో చెప్పాడట. మహేష్ ఖచ్చితంగా చేస్తాడనుకున్నారట. గత కొన్ని సంవత్సరాల నుంచి మహేష్‌ తో సినిమా చేయాలని గీతా ఆర్ట్స్ ప్రయత్నిస్తుంది కానీ కుదరడం లేదు. ఈవిధంగా మహేష్ షాక్ ఇచ్చారు. దీంతో మ‌రో స్టార్ హీరోతో ఈ పాత్ర చేయించాల‌ని చూస్తున్నార‌ట మేక‌ర్స్. దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితీశ్ తివారి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మెగా మూవీ తెర‌కెక్క‌నుంది. మరి.. మహేష్ నో చెప్పిన ఆ పాత్రను టాలీవుడ్ లో ఏ స్టార్ చేస్తారో చూడాలి.

Post Comment