మహేష్ బాబు సర్కారువారి పాట కొత్త రిలీజ్ డేట్

సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం. కీర్తి ఫస్ట్ టైమ్ మహేష్ బాబుతో రొమాన్స్ చేస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ సడెన్ గా సీన్ లోకి వచ్చింది. అంతే స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంది. బట్ కోవిడ్ కారణంగా అన్ని సినిమాల్లానే ఆలస్యం అయింది. ఆ ఆలస్యాన్ని మరిపించేలా సంక్రాంతి రిలీజ్ అన్న పోస్టర్ వేశారు. బట్.. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలుసు. దీంతో సర్కారువారి పాటను సమ్మర్ బరిలో ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే రీసెంట్ గా ఆ డేట్ లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే సర్కారువారి పాట ఆ టైమ్ కు రావడం లేదని కన్ఫార్మ్ అయిపోయింది. మరి ఈ మూవీ ఎప్పుడు విడుదల కాబోతోంది అనే డౌట్ అటు మహేష్ ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్సెస్ లో కూడా ఉంది. ఆ డౌట్ ను క్లియర్ చేస్తూ సర్కారువారి పాట కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ క్లారిఫికేషన్ వినిపిస్తోంది.
నిజానికి సర్కారువారి పాట సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటి వరకూ కేవలం 70శాతం చిత్రీకరణ మాత్రమే జరుపుకుంది. మిగిలిన భాగంలో ఎక్కువగా విదేశాల్లో షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు బాలేదు. అయినా కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోనే చిత్రీకరణ మొదలుపెడితే ఏకంగా మహష్ కు, హీరయిన్ కీర్తి సురేష్ కు కరోనా వచ్చింది. ఇది మరికొంత గ్యాప్ గా మారింది. అందుకే వీళ్లు ఏప్రిల్ 1నుంచి తప్పుకున్నారు. అంటే ఇక కొత్త డేట్ ను చూసుకున్నారన్నమాట.
ఇప్పుడున్న సిట్యుయేషన్ లో ఏప్రిల్ లో మరో పెద్ద సినిమాకు స్కోప్ లేదు. ఏప్రిల్ 14న కెజీఎఫ్ తో పాటు విజయ్ నటించిన బీస్ట్, అలాగే బాలీవుడ్ నుంచి లాల్ సింగ్ చద్దా వస్తున్నాయి. ఏప్రిల్ 28న ఆర్ఆర్ఆర్ రావొచ్చు. లేదంటే ఏప్రిల్ 29న ఎఫ్ 3 విడుదలవుతుంది. సో.. ఇక సర్కారువారి పాటకు ఏప్రిల్ లో స్పేస్ లేదు. అంటే మే నెలలోనే విడుదల కావాలి. అందుకే వీళ్లు కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు.
సర్కారువారి పాటను మే 13న విడుదల చేయబోతున్నట్టు అనఫీషియల్ గాఫిక్స్ అయ్యారు. మాగ్జిమం ఆ డేట్ నే వీళ్లు లాక్ చేయొచ్చు. ఒకవేళ ఏప్రిల్ 28న ఆర్ఆర్ఆర్ విడుదలైనా రెండు వారాల తర్వాత ఈ మూవీ హవా తగ్గుతుంది. ఆ వెంటనే మహేష్ లాంటి స్టార్ హీరో మూవీ పడితే సమ్మర్ జోష్ డబుల్ అవుతుంది. సో.. ఇప్పటికైతే సర్కారువారి పాట విడుదల తేదీగా మే 13నే ఫిక్స్ అయిపోవచ్చు.

Related Posts