లివింగ్ లెజెండ్ షావుకారు జానకి

చిత్ర పరిశ్రమలో లివింగ్ లెజెండ్ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం షావుకారు జానకి. షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. డిసెంబర్ 12, 1931న రాజమండ్రిలో జన్మించారు. నేటితో 92 ఏళ్లు పూర్తిచేసుకుని.. 93వ పడిలోకి ప్రవేశిస్తున్నారు. ఆమె మొదటి చిత్రం ‘షావుకారు’ కావడంతో.. చిత్ర పరిశ్రమలో షావుకారు జానకిగా ప్రసిద్ధి చెందారు. నటరత్న ఎన్.టి.ఆర్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం కూడా ‘షావుకారు’. అలా ఎన్.టి.ఆర్ తొలి చిత్ర కథానాయిక అయ్యారు జానకి.

1950లో ‘షావుకారు’ సినిమా నుంచి.. ఈ ఏడాది నందిని రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ వరకూ 72 ఏళ్ల నట ప్రస్థానం జానకి సొంతం. అంటే చిత్ర పరిశ్రమలో ఏడు దశాబ్దాలకు పైగా నట ప్రస్థానం ఉన్న ఏకైక నటీమణి జానకి కావచ్చు. 18 ఏళ్ల వయసులోనే షావుకారు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన జానకి.. దాదాపు రెండు దశాబ్దాల పాటు కథానాయికగా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్స్ లోనూ తనదైన శైలిలో సాగారు. జానకి చెల్లెలు కృష్ణకుమారి కూడా పాపులర్ హీరోయిన్. ఇక.. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషలలో సుమారు 400 చిత్రాల్లో నటించారు షావుకారు జానకి. ఇప్పటికీ మంచి పాత్రలొస్తే నటించడానికి తనకు ఎలాంటి అభ్యతరం లేదని చెబుతారు.

Related Posts