భారీ బడ్జెట్ సినిమాలంటేనే.. పదుల సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు. కొన్ని సన్నివేశాల్లో వందలు, వేలాదిగా జూనియర్స్ అవసరమవుతారు. చిత్రబృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని సందర్భాల్లో లీకులను ఆపడం ఎవరి తరమూ కాదు. ‘పుష్ప 1’ సమయంలోనే ఈ చిత్రాన్ని కొన్ని లీకులు వెంటాడాయి. అయినా.. అవన్నీ అధిగమించి సినిమాపై విపరీతమైన బజ్ తీసుకొచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది టీమ్.
ఇప్పుడు ‘పుష్ప 2’ని కూడా లీకు వీరులు వదలడం లేదు. లేటెస్ట్ గా ఈ సినిమాలోని కీలకమైన జాతర ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో చీరకట్టుకుని కనిపిస్తాడు అల్లు అర్జున్. చీరలో బన్నీ వేసే జాతర స్టెప్స్ థియేటర్లలో ఆడియన్స్ కు పూనకాలు తెప్పిస్తాయట. అంత కీలకమైన ఈ జాతర ఎపిసోడ్ షూటింగ్ లొకేషన్ నుంచి.. అల్లు అర్జున్ చీరకట్టుకుని ఉన్న ఓ ఫోటో లీకై సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. వెంటనే స్పందించిన టీమ్.. చాలా వరకూ లీక్డ్ ఫోటోస్ ని తొలగించింది.
మరోవైపు.. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ‘పుష్ప 2’ షూటింగ్ లో మరింత స్పీడు పెంచబోతుందట టీమ్. రెండు, మూడు యూనిట్స్ తో షూటింగ్ ను వేగంగా పూర్తిచేయాలనే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ సుకుమార్. అలాగే.. ఈ సీక్వెల్ పై మరింత బజ్ క్రియేట్ చేయడానికి వరుసగా అప్డేట్స్ ను అందించే ప్రయత్నంలో కూడా చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ‘పుష్ప 2’ టీమ్ జపాన్ వెళ్లనుందట.