సిద్ధార్ధ్ మల్హోత్రా తో లవ్ పై  కైరా అద్వానీ  క్లారిటీ
Bollywood Latest Movies Tollywood

సిద్ధార్ధ్ మల్హోత్రా తో లవ్ పై కైరా అద్వానీ క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించి.. టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ. ఆతర్వాత టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఆతర్వాత బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించింది. ఈ సినిమా బాలీవుడ్ లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేయడంతో కైరా అద్వానీకి వరుసగా ఆఫర్స్ రావడం బాలీవుడ్ లో బిజీ కావడం జరిగింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. బాలీవుడ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో కైరా అద్వానీ ప్రేమలో ఉందని బాలీవుడ్ అంతా కోడై కూస్తుంది.

సిద్ధార్ధ్ మల్హోత్రా, కైరా అద్వానీ కలిసి షేర్షా అనే సినిమాలో నటించారు. టైమ్ దొరికితే చాలు.. వీరిద్దరూ కలిసి హాలీడే అంటూ మాల్దీవులకు చెక్కేస్తుంటారు. అక్కడితో ఆగుతారా.. మాల్టీవుల్లో ఈ ప్రేమపక్షులు చేసిన సందడి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ప్రేమించుకుంటున్నారు సరే.. ఇంతకీ పెళ్లి ఎప్పుడు..? అని అడిగితే… మా ఇద్దరికీ పెళ్లా..? సినిమా పరిశ్రమలో సిద్ధార్ధ్ తనకు అత్యంత సన్నిహితుడని, తాము మంచి స్నేహితులం మాత్రమే తప్పా.. మా మధ్య అలాంటిది ఏమీ లేదు అని చెబుతుంటుంది ఈ అమ్మడు.

అయితే.. తాను అరెంజ్‌డ్‌ మ్యారేజ్‌ చేసుకోనని, ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటానని.. కియారా తేల్చిచెప్పేస్తుంది. దీంతో ఆమె సిద్ధార్ధ్ ప్రేమలో లేనని చెబుతుంది కానీ.. అతనితో ప్రేమలో ఉండడం వాస్తవమే అంటూ బాలీవుడ్ లో వార్తలు వస్తునే ఉన్నాయి. మరి.. కైరా.. సిద్దార్థ్ మంచి స్నేహితుడు మాత్రమే అనే స్టేట్ మెంట్ కే కట్టుబడి ఉంటుందో లేక మాట మార్చి మేము లవ్ లో ఉన్నామని చెబుతుందో చూడాలి.

Post Comment