యశ్ .. ఓ బస్ డ్రైవర్ కొడుకుగా కన్నడ సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. సీరియల్స్ లో నటించి మెల్లగా శాండల్ వుడ్ లో హీరోగా మారాడు. ఒక్కో సినిమాతో మెప్పిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. రామాచారి మూవీతో స్టార్డమ్ కూడా వచ్చింది.

అయితే అతను అక్కడ ఎప్పుడూ టాప్ హీరో కాదు. ఓ మీడియం రేంజ్ హీరో. అలాంటి యశ్ ను ప్యాన్ ఇండియన్ స్టార్ ను చేసింది కెజీఎఫ్‌ సిరీస్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలూ యశ్ కు దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ ను తెచ్చాయి.

అయితే ఆ క్రేజ్ కంటిన్యూ చేసే క్రమంలో అతను భయపడుతున్నాడా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కెజీఎఫ్‌ చాప్టర్ 2 వచ్చి ఇప్పటికే యేడాదిన్నర అయింది. 2022 ఏప్రిల్ 14న విడుదలైందీ చిత్రం. అప్పటి నుంచి యశ్ మరో సినిమా గురించిన వార్తలేవీ చెప్పడం లేదు.

కనీసం ఫలానా దర్శకుడితో సినిమా ఓకే అయిందనే వార్తా వినిపించడం లేదు. మధ్యలో నర్తన్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ అయినా ఎందుకో ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ యశ్ నుంచి కొత్త సినిమా అప్డేట్ అంటూ ఏదీ రావడం లేదు.

కనీసం ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాలా అనౌన్స్ అయ్యాక ఆలస్యం అయినా ఫర్వాలేదు. కానీ అసలు ఏ దర్శకుడుతో చేస్తున్నాడు.. ఏ బ్యానర్ లో ఉంటుందీ అనే మినిమం న్యూస్ కూడా లేదు. మరి కెజీఎఫ్ ఇమేజ్ ను కంటిన్యూ చేసే క్రమంలో మంచి కథలు ఎంచుకోవడంలో యశ్ భయపడుతున్నాడా.. లేక అతి జాగ్రత్తతో ఆలస్యం చేస్తున్నాడా అంటూ సెటైర్స్ పడుతున్నాయి.

నిజానికి బాహుబలి లాంటి ఎపిక్ మూవీ తర్వాత ప్రభాస్ కూ రెండు ప్లాపులు పడ్డాయి.. అయినా అతని రేంజ్ మారిందా.. క్రేజ్ తగ్గిందా.. దేనికైనా ముందడుగు వేస్తేనే కదా.. మన అడుగు రైటా రాంగా అనేది తెలిసేది. మరి యశ్ ఏమో ఇలా చేస్తున్నాడు. మరి కొత్త సినిమా ఎప్పుడు అప్డేట్ చేస్తాడో ఇంక.