మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కీర్తి సురేష్. నేటి తరం బ్యూటీస్ లా కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న ఎలాంటి పాత్రలో అయినా నటిస్తూ ఆ చాలెంజెస్ లో విన్ అవుతూ వస్తోంది. తన వయసుకు మించిన పాత్రల్లోనూ అద్భతుమైన నటనతో ఆకట్టుకుంటూ వస్తోంది. మరోవైపు సర్కార్ వారి పాట లాంటి మూవీస్ లో గ్లమరస్ గానూ అలరిస్తోంది. ఇక తెలుగు, తమిళ్ అనే కాదు..

తనకు నచ్చిన కథ వస్తే ఏ భాషలో అయినా యస్ చెబుతూ సౌత్ మొత్తం చుట్టేస్తోన్న ఈ భామ లేటెస్ట్ గా కెజీఎఫ్, కాంతార సినిమాలతో దేశవ్యాప్తంగా ఫేమ్ అయిన నిర్మాణ సంస్థ హొంబలే పిక్చర్స్ వారితో ఓ సినిమా చేస్తోంది. ఇది కూడా విమెన్ సెంట్రిక్ మూవీనే. రఘుతాత అనే హ్యాష్ ట్యాగ్ తో కనిపిస్తోన్న ఈ మూవీ అనౌన్స్ మెంట్ ట్యాగ్ గా ” బికాజ్ ద రివల్యూషన్ బిగిన్స్ ఎట్ హోమ్” అనే లైన్ ఆకట్టుకుంటోంది.

సుమన్ కుమార డైరెక్ట్ చేయబోతోన్న ఈ మూవీ రీసెంట్ గానే ప్రారంభోత్సవం జరుపుకుంది. హొంబలే బ్యానర్ అయినా ఇది కన్నడలో కాక తమిళ్ లో రూపొందుతుండటం విశేషం. మరి కెజీఎఫ్‌, కాంతార చిత్రాలతో తమకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యానర్ నుంచి వస్తోన్న ఈ మూవీ నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన కీర్తి సురేష్ కు అదనంగా ఇంకెలాంటి కీర్తిని తెస్తుందో చూడాలి.