గ్లామర్ గేట్స్ ఓపెన్ చేస్తోన్న కీర్తి సురేష్..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అన్న ట్యాగ్ ను అనుభవించిన హీరోయిన్లు కూడా ఆఫర్స్ తగ్గినప్పుడు అందాలారబోతలో ముందుకు వస్తుంటారు. మరి ఆఫర్స్ తగ్గకపోయినా.. ఇప్పటి వరకూ తనకు ఆ ఇమేజ్ లేకపోయినా.. ఎందుకో ఈ మధ్య కీర్తి సురేష్ కూడా గ్లామర్ డోస్ పెంచేస్తోంది. పైగా ఇది సినిమాల్లో కంటే ఎక్కువగా ఫోటో షూట్స్ లో కనిపిస్తోంది.

అంటే తనకు అలాంటి పాత్రలు చేయాలని ఉందని మేకర్స్ కు ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇస్తోందా లేక.. తనకూ రొటీన్ రోల్స్ చేసి బోర్ కొట్టిందా అనేది తెలియడం లేదు కానీ.. నిన్నటి వరకూ కీర్తి సురేష్ అంటే ఒకప్పటి సౌందర్యలా పద్ధతైన హీరోయిన్ అనుకున్నవాళ్లకు కూడా ఈ మధ్య కాలంలో థై, క్లీవేజ్ షోతో షాక్ ఇస్తోంది. ఆ మధ్య తను స్విమ్మింగ్ పూల్ లోనూ కనిపించి కంగారపెట్టింది. కాకపోతే మరీ స్విమ్ సూట్ లేదు అంతే.


కొన్నాళ్లుగా తను ప్రైవేట్ ఫోటోస్ తో పాటు ఫోటో షూట్స్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఇంకా చెబితే సర్కారువారి పాట సినిమాలోనే అంతకు ముందెప్పుడూ కనిపించనంత గ్లామర్ తో కనిపించింది. అయినా కొన్నిహద్దుల్లో ఉంది. బట్.. ఈ ఫోటో షూట్స్ చూస్తోంటే ఆ హద్దులను కూడా చెరిపేసేందుకు సిద్ధంగా ఉందా అనిపిస్తోంది.

ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్ లో బిజిబిజీగా ఉన్న కీర్తి.. ఆ ప్రమోషన్స్ లోనూ గ్లామరస్ గా కనిపిస్తోంది. చీర కట్టినా.. చుడీదార్ వేసినా.. మునుపెన్నడూ లేనంత హాట్ గా కనిపించేలా ప్రయత్నిస్తోంది. మరి ఇదంతా నిజంగా తను మేకర్స్ కు హింట్ ఇవ్వడంలో భాగంగానే చేస్తోందా లేక.. క్యాజువల్ గా చేస్తోందా అనేది చూడాలి.


ఇక దసరాతో నాని సరసన రెండో సారి నటించింది కీర్తి సురేష్. గతంలో నేను లోకల్ మూవీలో చీరకట్టులో కాస్త చబ్బీగా ఉంది. బట్ ఇప్పుడు సన్నజాజిలా మారింది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో అమ్మడు వెన్నెల అనే అమ్మాయి పాత్రలో నటించింది. కథ ఫస్ట్ హాఫ్ అంతా తన మీదే సాగినా.. సెకండ్ హాఫ్ మొత్తం ‘తన కోసం’సాగుతుందని ఇప్పటికే టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఏదేమైనా అమ్మడు కూడా మెల్లగా గ్లామర్ గేట్లు ఎత్తేస్తోందనే చెప్పాలి.

Related Posts