కౌశిక్ రెడ్డికి కేసీఆర్ షాక్..
Latest

కౌశిక్ రెడ్డికి కేసీఆర్ షాక్..

హుజూరాబాద్ కేంద్రంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.. ఈటల సొంత గడ్డలో ఆయనను ఓడించి, టీఆర్ఎస్లో తన ఆధిపత్యాన్ని ధిక్కరించిన వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని ప్రూవ్ చేయాలని భావిస్తున్నారు.. దీనికోసం ఆయన ఆరు నెలల ముందునుండే పక్కా స్కెచ్ ప్రిపేర్ చేసుకున్నారు.. గతంలో ప్రగతి భవన్ గడప దాటని కేసీఆర్.. ఇటీవల వరసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.. దాదాపు నాలుగేళ్ల తర్వాత కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు.. ఇతర పార్టీల నుండి కొత్త నేతలకు ఆహ్వానాలు పలుకుతున్నారు.. మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు షర్మిల లాంటి పార్టీలను బరిలోకి దింపుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి..

హుజూరాబాద్ లో గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతోన్న కేసీఆర్… కొన్ని రోజుల క్రితం.. కాంగ్రెస్ స్థానిక నేత, గతంలో ఈటలపై పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి టిక్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.. అయితే, ఊహించని విధంగా ఓ కార్యకర్తకు చేసినఫోన్ కాల్ లీక్ కావడంతో కౌశిక్ రెడ్డి పరిస్థితి బూమరాంగ్ అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. అందుకే, కేసీఆర్ తాజాగా ఎవరూ ఊహించని వ్యక్తిని బరిలోకి దింపబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. ఆయనే ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్..

తెలంగాణలో వివాదాస్పద ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నానని ఆయన సన్నిహితులకు చెబుతున్నారు. జైభీమ్ పార్టీ పెడతారని.. ఆయన అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా ముందస్తుగా పదవీ విరమణ చేయిస్తోందని.. హుజూరాబాద్ నుంచి ఆయనను టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది…

ఆయన క్యాడర్ అదనపు డీజీపీ. అయితే చేసే పోస్టింగ్ మాత్రం సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారిగా ఉన్నారు. గురుకులాల విషయంలో ఆయన సంస్కరణలు తీసుకు వచ్చారు. స్వేరో పేరుతో.. ఓ రకమైన సమాంతర వ్యవస్థను నెలకొల్పారు. ఈ వ్యవస్ధ ద్వారా దైవదూషణకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ వీడియో కూడా కలకలకానికి కారణం అయింది. ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. సర్వీస్ నుంచి వైదొలగాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి..

ఆయనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా తెలంగాణ సర్కార్ మాత్రం పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు నేరుగా ఆయనే సర్వీస్ నుంచి వైదొలిగారు. దీంతో, ప్రవీణ్ కుమార్ త్వరలో పార్టీ పెడతారా..?? లేక టీఆర్ఎస్లో చేరతారా.. అనేది హాట్ టాపిక్ గా మారుతోంది..

ప్రభుత్వంపై కొన్ని వర్గాలలో తీవ్ర వ్యతిరేకత ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. వారిని అక్కున చేర్చుకోవడానికి కేసీఆర్ ఇప్పటినుండే పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా దళిత ఓట్ బ్యాంక్ కేంద్రంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.. ఆ ఓట్ బ్యాంక్ కేంద్రంగా కేసీఆర్.. దళిత బంధు పేరుతో కొత్త స్కీమ్ ని ప్రవేశ పెడుతున్నారు.. ఇటు, అదే సామాజిక వర్గానికి చెందిన ప్రవీణ్ కుమార్ని హుజూరాబాద్ లో పోటీ చేయిస్తే, ఓట్ బ్యాంక్ చెక్కు చెదరదని అంచనా వేస్తోందట గులాబీ హై కమాండ్. అందుకే, కేసీఆర్.. ప్రవీణ్ కుమార్ వైపు మొగ్గు చూపుతున్నారనే వాదన ఉంది.. మరి, ఇది ఎంతవరకు నిజమో త్వరలోనే తేలనుంది..

Post Comment