HomeLatestKarthii : కార్తీ ''జపాన్''.. మేడిన్ ఇండియా

Karthii : కార్తీ ”జపాన్”.. మేడిన్ ఇండియా

-

వైవిధ్యమై సినిమాలతో తనకంటూ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు కార్తీ. ముందు నుంచీ తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. డిఫరెంట్ కంటెంట్ అంటే వెంటనే ఎస్ చెప్పే కార్తీ ఈ సారి కంటెంట్ మాత్రమే కాదు.. టైటిల్ తోనూ వైవిధ్యం చూపిస్తూ “జపాన్”లా వస్తున్నాడు. అంటే సినిమా పేరే జపాన్ అన్నమాట. ఈ గురువారం కార్తీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ జపాన్ ఎవరు అనే ఇంట్రో ను విడుదల చేశారు.

జపాన్ ను పరిచయం చేస్తూ సాగిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరకంగా ఉంది.
రాజ్ మురుగన్ డైరెక్ట్ చేస్తోన్న జపాన్ లో కార్తీ సరసన అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్ గానటిస్తోంది. ఇక ఇంట్రో లో హూ ఈజ్ జపాన్ అనే ట్యాగ్ తో మొదలై ఐ యామ్ జపాన్.. మేడ్ ఇన్ ఇండియా అంటూ కార్తీ క్లారిఫై చేసే వరకూ ఇంట్రస్టింగ్ గా ఉంది.

టీజర్ మొదట్లోనే ఓ చర్చ్ లో ఒక వ్యక్తి ఫాదర అంటుంటాడు ” వాడు పాప క్షమాపణకు అతీతుడు ఫాదర్. ప్రభువు యొక్క అద్భుతమైన సృష్టిలో వాడో హీరో ఫాదర్” అని చెప్పడం ద్వారా హీరో ఎలివేషన్ మొదలవుతుంది. నెక్ట్స్ సునిల్ డిఫరెంట్ గెటప్ తో కనిపిస్తూ.. ” మీరు అనుకుంటున్నట్టు కాదు.. వాడు దూల తీర్చే విలన్” అంటాడు.

కార్తీ డిఫరెంట్ గెటప్స్ తో, డిఫరెంట్ లొకేషన్స్ లో కనిపిస్తున్నాడు. కొందరు అతన్ని బాస్ అంటే మరికొందరు కమెడియన్ అంటున్నారు.
ఈ ఇంట్రో లో జివి ప్రకాష్‌ కుమార్ నేపథ్య సంగీతం హైలెట్ గా కనిపిస్తుంది. షాట్స్ చాలా బావున్నాయి. ఓ కొత్త కంటెంట్ తో వస్తున్నట్టు మాత్రం కనిపిస్తోంది. మొత్తంగా రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ లో వంధ్యదేవుడుగా అదరగొట్టిన కార్తీ ఇప్పుడు జపాన్ లా ఈ యేడాది దీపావళికి రాబోతున్నాడు.

ఇవీ చదవండి

English News