టాలీవుడ్ కు షాక్ ఇస్తోన్న కాంతార కలెక్షన్స్

కాంతార.. ఓ సాధారణ నటుడు చేసిన సినిమా.. అని చాలామంది రాస్తున్నారు. అఫ్ కోర్స్ అతను సాధారణమే కావొచ్చు.. కానీ అతని ప్రతిభ అసాధారణం. అందుకే అతనిప్పుడు టాక్ ఆఫ్ ద కంట్రీ అయ్యాడు. యస్.. దేశంలో చాలామందిఇప్పుడు కాంతార గురించి మాట్లాడుకుంటున్నారు. కన్నడలో కేవలం 20కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అక్కడే వంద కోట్ల మార్క్ ను టచ్ చేయబోతోంది. ఈ మూవీ రివ్యూస్ చూసిన తర్వాతే ఇతర భాషల ప్రేక్షకులూ చూడాలనుకున్నారంటే కాంతార దర్శక, హీరో రిషభ్ శెట్టి రేంజ్ ఏంటో అర్థం కావడం లేదూ..? అయితే తెలుగులో ఈ సినిమా రేంజ్ ను చాలా వేగంగా పసిగట్టినవాడు అల్లు అరవింద్. అందుకే వేగంగా పావులు కదిపాడు. తను డబ్బింగ్ రైట్స్ తీసుకుని ఇక్కడ విడుదల చేశాడు. అతని అంచనా ఏ మాత్రం తప్పలేదు. అయితే ఇతరుల అంచనాలను మాత్రం దాటిపోయింది. అస్సలే మాత్రం ఎక్స్ పెక్ట్ చేయని కలెక్షన్స్ తో ఎంటైర్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేస్తోంది కాంతార కలెక్షన్స్. ఒక సినిమా రేంజ్ ను చూపించేంది కలెక్షన్స్ మాత్రమే అని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు. అయితే కంటెంట్ ఉంటే తప్ప కలెక్షన్స్ రావు. సో ఇది బలమైన సినిమా

. డబ్బింగ్ సినిమా అయినా ఆర్టిస్టులు ఎవరో ఇప్పటి వరకూ తెలుగు జనాలకు పెద్దగా తెలియకపోయినా.. ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించింది మాత్రం ఈ మూవీ కంటెంట్. కంటెంట్ ఉంటే చాలు.. ప్రేక్షకులు ఇంకేం కోరుకోవడం లేదు అని మరోసారి ప్రూవ్ చేస్తూ కాంతార విడుదలైన ఐదు రోజుల్లోనే 20 కోట్లు కలెక్ట్ చేసి చాలామంది బిగ్ మేకర్స్ కు షాక్ ఇచ్చింది.యస్.. కాంతార 20 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఈ ఫిగర్ ఇంకా పెరుగుతుంది కూడా. మరి ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ఎంతకు కొన్నాడో తెలుసా.. రెండు కోట్లు. కేవలం రెండు కోట్లతో కొన్న సినిమా ఇంత లాభాలు తేవడం చిన్న విషయం కాదు. అయితే అరవింద్ కు ఈ రైట్స్ ఇవ్వడానికి మరో రీజన్ కూడాఇన్ డైరెక్ట్ గా ఉండటం విశేషం.

రిషభ్ శెట్టి గతంలో నటించిన థ్రిల్లర్ సినిమా బెల్ బాటమ్ ను ఆయన తన ఆహాలో డబ్ చేశాడు. నిజానికి రిషబ్ ఏ కొద్దికైనా తెలుగు ప్రేక్షకులకు ముందే తెలిసి ఉన్నాడు అంటే అందుకు కారణం బెల్ బాటమ్ సినిమానే. ఆహాలో ఇది ఎంతమంది చూశారో కూడా తెలియదు. అలాంటి తను నటించిన సినిమాను ముందే ఊహించి రైట్స్ తీసుకోవడం.. ఆ రాపోను మెయిన్టేన్ చేస్తూ కాంతార ప్రొడక్షన్ హౌస్ హొంబలే వాళ్లు కూడా ఒప్పేసుకోవడం ఓ రకంగా అన్నీ అరవింద్ కు అనుకూలంగా జరిగినవే అని చెప్పాలి. అలాగని అతనేం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. వీలైనంత త్వరగా ఓ మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు చూపించేశాడు. మొత్తంగా కాంతార 20 కోట్ల మార్క్ ను చేరడం మాత్రం ఎవరూ ఊహించనిది. మరి ఈ ఫిగర్ ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related Posts