కనబడుటలేదు – రివ్యూ
Latest Reviews

కనబడుటలేదు – రివ్యూ

సునీల్, సుక్రాంత్‌ వీరెల్ల, వైశాలిరాజ్, హిమ‌జ‌, యుగ్రం, శశిత కోన ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం కనబడుటలేదు. ఈ చిత్రానికి బాలరాజు ఎం దర్శకత్వం వహించారు.ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. ఇదొక థ్రిల్లర్ మూవీ. ఇందులో సునీల్ నటించడంతో.. ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు ట్రైలర్ ఆకట్టుకోవడంతో కనబడుటలేదు సినిమా పై అందరి దృష్టి పడింది. ఈ రోజు (ఆగష్టు 19)న కనబడుటలేదు చిత్రం విడుదల అయ్యింది. మరి.. కనబడుటలేదు సినిమా ఎలా ఉంది.? థ్రిల్లర్ మూవీ ఎంత వరకు మెప్పించింది..? అనేది చెప్పాలంటే ముందుగా కథ చెప్పాలి.

కథ

సూర్య (సుక్రాంత్ వీరల్లా) శశిద (వైశాలి రాజ్) ప్రేమించుకుంటారు. అయితే.. కొన్ని కారణాల వలన వీరి లవ్ బ్రేకప్ అవుతుంది. ఆతర్వాత నుంచి శశిద చాలా బాధపడుతుంది. ఇలాంటి టైమ్ లో ఆమెకి అయిష్టంగానే ఆదిత్య (యుగ్ రామ్)తో పెళ్లి జరుగుతుంది. అయితే.. ఆతర్వాత తన భర్తకు తను ప్రేమించిన సూర్య గురించి చెబుతుంది. కోపంతో ఉన్న శశిద సూర్యను ఎలా అయినా సరే చంపేయాలని ప్లాన్ చేస్తుంది. అది కూడా తన భర్తతో కలిసి సూర్యను చంపేందుకు ప్లాన్ చేస్తుంది.
సూర్య కోసం వైజాగ్ కి వచ్చిన వారికి సూర్య కనిపించట్లేదు అని ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. దీంతో సూర్య ఎలా మిస్ అయ్యాడని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఇందులో సునీల్ పాత్ర ఏంటి.? అసలు సూర్య ఏమయ్యాడు.? సూర్యను చంపాలనుకున్న శశిద ఏం చేసింది..? అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్

సునీల్ నటన
వైశాలి రాజ్, హిమజ యాక్టింగ్
కథ

మైనస్ పాయింట్స్

సెకండాఫ్
కథనం

విశ్లేషణ

సునీల్ తన పార్ట్ వరకు ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ ని అందించాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో మంచి నటన తన నుంచి కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. సునీల్ వచ్చినప్పటి నుంచి కథలో వేగం పెరిగింది. తర్వాత ఏం జరుగుతుందో అనే ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. మరో ఇతర కీలక పాత్రల్లో కనిపించే హిమజ, వైశాలి రాజ్ లు కూడా ఆశ్చర్యపరిచారని చెప్పచ్చు. హిమజ అయితే సాలిడ్ నెగిటివ్ షేడ్ లో కనిపించి ఇంప్రెస్ చేసింది. అలాగే వైశాలి కూడ పలు సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించింది.

ఈ సినిమాకి మైనస్ అంటే.. కథనం అని చెప్పచ్చు. సినిమా వెళుతున్న కొద్దీ ఇంట్రస్ట్ క్రియేట్ అవుతూ వాట్ నెక్ట్స్ అనేలా ఉండాలి కానీ.. సినిమా ముందుకు వెళుతున్న కొద్దీ ఆడియన్స్ లో ఇంట్రస్ట్ తగ్గేలా ఉండకూడదు. ఈ సినిమా విషయంలో ఆసక్తికరమైన కథనం రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డాడని చెప్పచ్చు. మరో విషయం ఏంటంటే.. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ కి ప్రతి పాత్ర డీటైల్ గా ఉండాలి. అలాగే ప్రతి సీన్ కి ఇంపార్టెన్స్ ఉండాలి. ఈ సినిమాలో ఆ.. డీటైలింగ్ అనేది మిస్ అయ్యింది. సెకండాఫ్ కి వచ్చే సరికి సినిమాలో ఒక పాత్రకి ఇంకో పాత్రకి సరైన కనెక్షన్ లేకపోవడం పైగా పలు సన్నివేశాలు సరిగ్గా డీల్ చెయ్యకపోవడంతో బోర్ అనిపించింది.

మ్యూజిక్ ఓకే. ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. సినిమాటోగ్రఫీ పర్లేదు అని చెప్పొచ్చు. ఇక దర్శకుడు బాలరాజు.. ఎంచుకున్న కథ బాగానే ఉంది కానీ.. దానిని ఇంట్రస్టింగ్ గా ఉండేలా తెరకెక్కించడానికి స్ర్కిప్ట్ పై ఇంకాస్త వర్క్ చేయాల్సింది. కనపడుటలేదు సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేపోయింది. టైమ్ పాస్ చేయాలి అనుకునేవాళ్లు చూడచ్చు.

రేటింగ్: 2/5

Post Comment