వింటేజ్ రెహ్మాన్ ను గుర్తు చేసిన ‘జలసఖి’

దక్షిణాది సినిమా సంగీతాన్ని ఎంతమంది శాసించినా.. అందులో సెన్సేషనల్ ఛేంజెస్ తెచ్చింది మాత్రం ఏఆర్ రెహ్మాన్ అనేది కాదనలేని సత్యం. వైవిధ్యమైన ట్యూన్స్ తో పాటు ఎన్నో కొత్త గొంతులను పరిచయం చేశాడు. అప్పటి వరకూ మూసగా సాగిన సినిమా పాట ఈ కొత్త గొంతులతో సరికొత్తగా వినిపించింది. మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న రెహ్మాన్ ఆస్కార్ కూడా అందుకున్నాడు. అయితే అతన్నుంచి కొన్నాళ్లుగా ఒకప్పటి రేంజ్ ఆల్బమ్స్ రావడం లేదనే కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ కు ఆన్సర్ గా ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ తో వస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి విడుదల చేసిన అద్భుతం అనే మాటకు అతి దగ్గరగా ఉంది.ఇండియన్ సినిమాకు పాట ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.

ఆ పాటలతో అనేక ప్రయోగాలు చేసిన వినేవారికి సరికొత్త ఫీల్ ను ఇచ్చిన సంగీత దర్శకుల్లో రెహ్మాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ఇప్పటికీ ఆ ప్లేస్ ను కాపాడుకుంటోన్న ఈ ఆస్కార్ విన్నర్.. రీసెంట్ టైమ్స్ లో ఫ్యాన్స్ ను కాస్త డిజప్పాయింట్ చేస్తూ వస్తున్నాడు. కొన్నిసార్లు కంటెంట్ లోపం వల్ల కూడా అతని మ్యూజిక్ ఎలివేట్ కావడం లేదు. అయినా ఫ్యాన్స్ తగ్గలేదు. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ కు రెహ్మాన్ మ్యూజిక్ బిగ్ ఎసెట్ కాబోతోందని ఇప్పటికే వచ్చిన పాటలు ప్రూవ్ చేశాయి. తెలుగులో ఎలా ఉన్నా.. తమిళ్ లో ఆకట్టుకుంటున్నాయి.

రెహ్మాన్ సంగీతంలో లేటెస్ట్ గా వచ్చిన జలసఖి నేనై నిలిచా నెలరాజా ఏలో ఏలేలో అనే పాట అద్భుతమైన మెలో