వ‌ర‌ల్డ్ రికార్డ్ సృష్టించిన జై భీమ్
Latest Movies OTT Social Media

వ‌ర‌ల్డ్ రికార్డ్ సృష్టించిన జై భీమ్

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా విడుదలైంది. టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ద‌క్కించుకుంది. మంచి కంటెంట్ తో సినిమా చేస్తే.. దానికి ప్ర‌చారం అవ‌స‌రం లేదు. ప్రేక్ష‌కులే ప్ర‌చార క‌ర్త‌లుగా మార‌తారు అని నిరూపించింది జై భీమ్. జస్టిస్ కె చంద్రు నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. గిరిజనులు అణగారిన వర్గాలకు చెందిన అమాయకపు ప్రజలపై కొందరు పోలీసులు అన్యాయంగా చేసే దాడిని ఈ చిత్రంలో చూపించారు. అయితే.. ఈ సినిమా ఇప్పుడు ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.

ఏంటా రికార్డ్ అంటే… అంతర్జాతీయ సినిమా రేటింగ్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) సినిమాల జాబితాలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ వచ్చిన మూవీగా జై భీమ్ టాప్ – 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. 56 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ పాయింట్స్ తో IMDB లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక 97 శాతానికి పైగా గూగుల్ యూజర్లు ఈ చిత్రాన్ని లైక్ చేశారని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలయ్యే సినిమాలకు ఐఎమ్డీబీ సంస్థ ద్వారా యూజర్లు రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ 1994లో విడుదలైన ది షాషాంక్ రిడంప్షన్ సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. ఇప్పుడు దాన్ని రెండో స్థానానికి నెట్టి జై భీమ్ టాప్ పొజిషన్ లో నిలిచింది.

గాడ్ ఫాదర్ సినిమా మూడో స్థానంలో.. డార్క్ నైట్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇకపోతే గతేడాది అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన సూర్య సినిమా ఆకాశం నీ హద్దురా సైతం IMDB టాప్ – 10 జాబితాలో చోటు దక్కించుకుంది. ఇప్పుడు జై భీమ్ సినిమాతో సూర్య మరోసారి ఘనత సాధిండం విశేషం

Post Comment