Maruthi : ప్రభాస్ పై అది రూమరే

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే అది నిజమే అనుకుంటారు చాలామంది. బట్ ఇలాంటి వార్తల్లో నిజాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్టార్ మూవీస్ అంటే అంత సులువుగా వెంట వెంటనే అప్డేట్స్ ఇవ్వరు. అందుకే చాలామంది రూమర్ రాయుళ్లు కొత్త కొత్త కహానీలు అల్లేస్తుంటారు. ఆడియన్స్ అవి నిజమని నమ్మేస్తుంటారు.

లేటెస్ట్ గా టాలీవుడ్ లో వచ్చిన అలాంటి ఓ పేద్ద రూమర్.. ప్రభాస్ సినిమా రెండు భాగాలుగా వస్తోంది అని. అంటే సలార్ సినిమా గురించి అని అంతా అనుకుంటారు. బట్ కాదు. సలార్ నిజంగానే రెండు భాగాలుగా వస్తుంది. ఇది అఫీషియల్ గానే చెప్పిన వార్త. మరి ఈ న్యూస్ ఏ సినిమా గురించీ అనిపిస్తోంది కదూ.. మారుతి సినిమా గురించి. యస్.. ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాను కూడా రెండు భాగాలుగా విడుదల చేస్తారు అనే న్యూస్ రెండు రోజులుగా హల్చల్ చేస్తోంది. బట్ ఇది నిజం కాదు. ఇది కేవలం ఒకే పార్ట్ గా వస్తుంది.


ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తోన్న మూవీ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ కు ప్రభాస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడట. అందుకే మారుతి ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడని టాక్.

రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. మళయాల కుట్టి మాళవిక మోహనన్, అందాల నిధి అగర్వాల్ తో పాటు రాధేశ్యామ్ లో ఓ చిన్న పాత్రలో కనిపించిన రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో ప్రభాస్ లుక్ చాలా అంటే చాలా స్టైలిష్ గా ఉంటుందని చాలామంది చెబుతున్నారు. ఓ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ రేంజ్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తాడట. మొత్తంగా ఈ చిత్రం గురించిన సంగతులన్నీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అదే సందర్భంలో రెండు భాగాలుగా వస్తోందనే వార్త అబద్ధం.

Related Posts