ఒకటీ రెండు సినిమాలతోనే ఓ రేంజ్ లో ఫేమ్ అయిన స్టార్ విజయ్ దేవరకొండ. అతని యాటిట్యూడ్ కు యూత్ అంతా ఫిదా అయిపోయింది. బట్ అదే యాటిట్యూడ్ తో తర్వాత లాస్ అయ్యాడు. దీనికి తోడు వరుసగా వచ్చిన ఫ్లాపులు బాగా ఇబ్బంది పెట్టాయి. ఇక ఎన్నో అంచనాలతో ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయినట్టే అనే కలలతో వచ్చిన లైగర్ డిజాస్టర్ నిన్నటి వరకూ మబ్బుల్లో ఉన్న మనోడిని కిందికి దించేలా చేసింది.

ఇక లైగర్ టైమ్ లోనే స్టార్ట్ అయిన ఖుషీ సమంత హెల్త్ ఇష్యూస్ తో ఆగిపోయింది. దీంతో మరో మంచి కథ కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఫైనల్ గా మళ్లీ రావా, జెర్సీ చిత్రాలతో మెప్పించిన గౌతమ్ తిన్ననూరితో సినిమా ఓకే అయింది. ముందుగా ఈ ప్రాజెక్ట్ ను దిల్ రాజు తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తారు అనే టాక్ వచ్చింది. కానీ ఆ ఇద్దరూ ఈ ప్రాజెక్ట్ ను చేయలేమని చెప్పారట. దీంతో దర్శకుడుతో పాటు హీరో కూడా కోరడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ బ్యానర్ అనిపించుకున్న సితార ఎంటర్టైన్మెంట్ రంగంలోకి దిగింది.


ప్రస్తుతం సితార బ్యానర్ తో ఈ మూవీ టీమ్ చర్చలు సాగుతున్నాయి. అంతా ఓకే అయితే త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుంది. ఆ తర్వాత అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు. విశేషం ఏంటంటే.. గౌతమ్ చెప్పిన కథ అంతకు ముందు రామ్ చరణ్ రిజెక్ట్ చేసిందేనట. నిజానికి గౌతమ్ హిందీలో జెర్సీ పూర్తి చేయగానే వెంటనే చరణ్ తో సినిమా చేయాలి.

అతను చెప్పిన ఓ లైన్ ను ఓకే చేశాడు చరణ్‌. కానీ బౌండ్ స్క్రిప్ట్ గా అస్సలు నచ్చలేదని చెప్పాడు. దీంతో అదే కథలో కొన్ని మార్పులు చేసి విజయ్ దేవరకొండకు వినిపించాడు. విజయ్ కి నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. మరి సితార బ్యానర్ కూడా ఆల్మోస్ట్ రెడీగానే ఉందనీ.. ప్యాన్ ఇండియన్ రేంజ్ లో కాస్త భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రం ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ మూవీతో అయినా విజయ్ దేవరకొండ ఓ విజయం అందుకుంటాడా లేదా అనేది చూడాలి.