నాని ఫ్యాన్ మీట్ వెనక కథ ఇదా..?

నేచురల్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చకున్నాడు నాని. తన ట్యాగ్ కు తగ్గట్టుగానే సాఫ్ట్ స్టోరీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ హీరో అయిపోయాడు. అయితే ఈ ఇమేజ్ ను దాటాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు నాని. అందుకు కారణం ఈ మధ్య తన సినిమాల రిజల్ట్ లే. రీజన్ ఇదే అని చెప్పలేం కానీ.. నాని సడెన్ గా తన అభిమానులను కలుసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం వెంటనే అమలైంది కూడా.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అభిమానులను మీట్ అయ్యాడు. అతని కొత్త సినిమా దసరా రిలీజ్ అయ్యేది మార్చి 30న మరి ఇంత ఎర్లీగా ఈ ఫ్యాన్ మీట్ ఎందుకు పెట్టాడు అంటూ టాలీవుడ్ లో గుసగుసలు పోతున్నారు. నిజమే.. ఈ ఫ్యాన్ మీట్ వెనక ఇంకేదైనా స్పెషల్ రీజన్ ఉందా..?
ఒక పర్టిక్యులర్ ఇమేజ్ ఉన్న హీరో ప్రయోగం చేస్తే ప్రేక్షకులు సడెన్ గా తీసుకోలేరు. అలాంటప్పుడు కంటెంట్ బావున్నా.. కనెక్ట్ కాక కలెక్షన్స్ రావు.

అందుకు కొన్నాళ్ల క్రితం వచ్చిన మహేష్‌ బాబు ఒన్ నేనొక్కడినే ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే ఇలాంటి కథలు చేస్తున్నప్పుడు ఆడియన్స్ ను ప్రిపేర్ చేయాలి. ప్రస్తుతం నేచురల్ స్టార్ గా ఉన్న నాని ఆ ఇమేజ్ ను దాటాలనుకుంటున్నాడు. అందుకే కొత్తగా ప్రయోగాలు మొదలుపెట్టాడు. గతేడాది శ్యామ్ సింగరాయ్ నుంచి ఈ కొత్త జర్నీ మొదలుపెట్టాడు. తన లోని మాస్ యాంగిల్ ను కూడా చూపించాలనుకున్నాడు. అయితే ఆ మూవీ విషయంలో తను ఎక్స్ పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు.

తర్వాత చేసిన అంటే సుందరానికి కూడా పోయింది. దీంతో ఇప్పుడు చేస్తోన్న దసరా మూవీ విషయంలో జాగ్రత్త పడేందుకే నాని సడెన్ గా ఈ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశాడు అంటున్నారు. అంటే దసరాలో నాని లుక్ మరీ రగ్గ్ డ్ గా ఉంది. కంటెంట్ కూడా రా అంటున్నారు. ఇలాంటి కథలను అభిమానులే రిసీవ్ చేసుకోలేకపోతే ఇతర ఆడియన్స్ కూడా పట్టించుకోరు. అందుకే ముందుగా ఫ్యాన్స్ ను ఈ మూవీ కోసం ప్రిపేర్ చేస్తే ఆటో మేటిక్ గా వారే ఈ మూడు నెలల పాటు సినిమాలో కనిపించే నాని పాత్రను జనాల్లో ఉంచే ప్రయత్నం చేస్తారు.

అదే టైమ్ లో ఈ కథ, సినిమాపై నానికి చాలా నమ్మకం ఉంది. చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆ కారణంగా కూడా ఈ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేసి ఉంటారు అనేది టాలీవుడ్ టాక్. ఇక ఈ మధ్య కాలంలో నానికి సరైన విజయాలు లేవు. 2017లో వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత వరుసగా కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ రూపంలో రెండు ఫ్లాపులు పడ్డాయి.

2019లో జెర్సీ హిట్ తర్వాత గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీష్‌ చిత్రాలు వరుసగా పోయాయి. శ్యామ్ సింగరాయ్ తర్వాత అంటే సుందరానికీ పోయింది. సో.. ఇలా అభిమానులను కలుస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతూ.. ఉంటే.. తన సినిమాలకు కూడా ప్లస్ అవుతుందని భావించారేమో అంటున్నారు. మొత్తంగా నాని ఫ్యాన్ మీట్ పై ఇండస్ట్రీలో రకరకాలుగా చెప్పుకుంటున్నారు.

Related Posts