సుకుమార్ విషయంలో నాని అన్నదాంట్లో తప్పేముందీ.. ?

సుకుమార్.. డౌట్ లేకుండా టాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్. కెరీర్ ఆరంభంలో క్లాస్ మూవీస్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు సుకుమార్. పూర్వం తను లెక్కల మాస్టర్ కావడంతో తన స్క్రీన్ ప్లే లో కూడా.. ఆ లెక్కలు పక్కాగా కనిపించేవి. బట్ మాస్ ఆడియన్స్ కు ఈ లెక్కలు అర్థం కావు కదా. అందుకే సుకుమార్ రంగస్థలంకంటే ముందు టాప్ డైరెక్టర్ అనే హోదా లేదు.. అనేది నిజం. రంగస్థలం కూడా రామ్ చరణ్ తో చేయడం వల్ల మాస్ డైరెక్టర్ గా మారాడు. అంతకు ముందు ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో తీసినా.. ఇది పూర్తిగా ఇల్లాజికల్ గా కనిపించే కథ, కథనం. కాకపోతే ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ డిఫరెంట్ మేకోవర్ తో కనిపించడం.. అతని డ్యాన్సులు, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కలిసి సినిమాను హిట్ చేశాయి.

అయితే రంగస్థలం సుకుమార్ స్టైల్ కు భిన్నమైనది. టేకింగ్ నుంచి మేకింగ్ వరకూ.. స్టోరీ టెల్లింగ్ తో పాటు స్క్రీన్ ప్లే వరకూ కొత్తగా కనిపించడంతో బ్లక్ బస్టర్ అయింది. అయినా సుకుమార్ రంగస్థలం వరకూ తెలుగు దర్శకుడు మాత్రమే.. అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అంశం. ఇక పుష్ప తర్వాతే అతని స్థాయి దేశవ్యాప్తంగా పెరిగింది. అయినా నిజం మాట్లాడితే.. ఈ మూవీకి అల్లు అర్జున్ కు వచ్చినంత ఫ�