సలార్ టీజర్ డేట్ అబద్ధమేనా..?

సౌత్ సినిమా ప్యాన్ ఇండియన్ మూవీస్ కు అడ్డాగా మారిందిప్పుడు. బాలీవుడ్ నుంచి ఓ భారీ సినిమా వస్తే మనోళ్లు చూస్తారా లేదా అనేది డౌటే కానీ.. మన సినిమాలు మాత్రం బావుంటే వాళ్లు ఇరగబడి చూస్తున్నారు. అందుకే బాలీవుడ్ కు సౌత్ సినిమాల మీద ఇప్పుడు కాస్త కోపంగానూ ఉంది. అలాంటిది మనవాళ్లు మన మధ్యే పోటీ పెట్టుకుంటారా..? లేదు కదా..? అలాంటిది ఒకే దర్శకుడు తన సినిమా గురించి తనే ఎలా తగ్గించుకుంటాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా గురించి వస్తోన్న వార్తలు కూడా ఇలాగే ఉన్నాయి. కానీ ఇవేవీ నిజం కాదు అంటోంది మూవీ టీమ్.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ నెల 14న ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ కెజీఎఫ్ విడుదల కాబోతోంది. సినిమాపై దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. బిజినెస్ డీల్స్ కూడా ఊహించనంత భారీ రేట్లకు అమ్మేశారు. అటు వాల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ ఆడియన్సెస్ కూడా ఈ చిత్రం కోసం ఈగర్ గా చూస్తున్నారు. అలాంటి సినిమాకు మధ్యలో ప్రభాస్ మూవీ సలార్ టీజర్ వదిలితే ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి డైల్యూట్ అవుతుంది. ఈ చిన్న లాజిక్ మిస్ అయిన కొందరు కెజీఎఫ్ చాప్టర్2 ఇంటర్వెల్ లో సలార్ టీజర్ ను ప్రదర్శిస్తారని రాస్తున్నారు. కానీ ఇది నిజం కానే కాదంటున్నారు మూవీ మేకర్స్.
నిజానికి పెద్ద సినిమాల మధ్యలో వచ్చే టీజర్స్ చిన్న సినిమాలకు సంబంధించినవే ఉంటాయి. లేదా చిన్న సినిమాల మధ్యలో పెద్ద సినిమాల టీజర్స్ లేదా ట్రైలర్స్ వస్తాయి. కానీ రెండు బిగ్ మూవీస్ మధ్యలో ఇలాంటివి ఎప్పుడూ లేదు. సో.. ఏప్రిల్ 14 నుంచి సలార్ టీజర్ విడుదల చేస్తున్నారు అనే మాట పూర్తిగా అబద్ధం అనుకోవచ్చు. ఒక వేళ నిజంగానే అలా చేస్తే ఖచ్చితంగా అది ప్రభాస్ రేంజ్ ను తగ్గించడమే అవుతుంది.
కెజీఎఫ్ కు వచ్చేవారి ద్వారా ప్రభాస్ సినిమాకు ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉంటే ఖచ్చితంగా అది అతనికి అవమానమే అనుకోవచ్చు.

Related Posts