హరిహర వీరమల్లు అటకెక్కినట్టేనా పవన్ కళ్యాణ్ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కొన్నాళ్లుగా అభిమానులు ఆశించే యాక్షన్ ఎంటర్టైనర్స్ రావడం లేదు. దీంతో ఆ కొరతను హరిహరవీరమల్లు తీరుస్తుంది అనుకున్నారు. పైగా ఇది పీరియాడిక్ మూవీ కావడం, క్రిష్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు పవన్ కు హీరోగా తిరుగులేని హిట్ ఇచ్చిన ఖుషీ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తుండటంతో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.

అయితే అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీ షూటింగ్ జరగలేదు. ముఖ్యంగా ఈ మూవీ స్టార్ట్ అయిన టైమ్ లో పవన్ కళ్యాణ్ చాలా పొలిటికల్ టూర్స్ పెట్టుకున్నాడు. దీంతో ఒక రోజు షూటింగ్ జరిగితే పదిరోజులు గ్యాప్ అన్నట్టుగా సాగింది. దీంతో మిగతా ఆర్టిస్టులు డేట్స్ క్లాష్ అయ్యాయి. పీరియాడిక్ డ్రామా కాబట్టి అందుకు అనుగుణంగా వేసిన భారీ సెట్స్ ఎండకు ఎండి.. వానకు తడిసి పాడైపోయాయి.

మళ్లీ కొత్త సెట్స్ కు మరో ఖర్చు. ఇలా ఈ ఖర్చులతో నిర్మాత కుదేలైపోయాడు. అదే విషయం పవన్ కళ్యాణ్ కు చెబితే .. ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా.. నా గురించి అందరికీ తెలుసు.. మీరెందుకు నాకు చెబుతున్నారు అని రివర్స్ అయ్యాడు అంటారు. అది నిజం కాదని తర్వాత నిర్మాతే చెప్పాడు. బట్.. ఎన్నో అంచనాలతో మొదలైన ఈ సినిమా కథ ‘ముగిసిపోయినట్టే’అనేది లేటెస్ట్ టాక్.


ప్రస్తుతం హరిహర వీరమల్లును పవన్ కళ్యాణ్ పూర్తిగా పక్కనబెట్టాడు అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు నిర్మాత కూడా ఈ భారాన్ని కొనసాగించే దశలో లేడట. దీంతో ఇంకెవరైనా నిర్మాత దొరుకుతాడేమో అని ఎదురుచూస్తున్నాడు. బట్ పవన్ కళ్యాణ్ గురించి తెలుసు కాబట్టి.. ఈ సగం పనికి నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదని టాక్. మొత్తంగా నిధి అగర్వాల్, నర్గిస్ ఫక్రీ, బాబీ డియోల్, విక్రమ్ జీత్, పూజిత పొన్నాడతో మొదలైన హరిహర వీరమల్లు కథ ఆల్మోస్ట్ ముగిసిపోయినట్టే అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది మూవీ టీమ్ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయితే కానీ తెలియదు.

Related Posts