HomeLatestNTR : ఎన్టీఆర్ భయపడ్డాడా.. ?

NTR : ఎన్టీఆర్ భయపడ్డాడా.. ?

-

జూనియర్ ఎన్టీఆర్ భయపడ్డాడా..? అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు, ఎవరికి అనేది ఇక్కడ చూద్దాం. ఎన్టీఆర్, నందమూరి కుటుంబం మధ్య ఈ మధ్య కాలంలో కాస్త దూరం పెరిగింది అనేది వాస్తవం. ఎవరు కాదు అన్నా.. అదే నిజం అని ఇంతకు ముందు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపు సభతో తేలిపోయింది. ఈ కార్యక్రమానికి జూనియర్ కు ఆహ్వానం ఉంది. అయినా వెళ్లలేదు అని చాలా కొద్దిమందికే తెలుసు.

ఎందుకూ అనేదానికి కూడా సమాధానాలు చాలానే ఉన్నాయి. ఇక పెద్దాయన శతజయంతి ఉత్సవాల ముగింపు సభ హైదరాబాద్ లో కూడా నిర్వహిస్తున్నారు. దీనికి అతనికి ఆహ్వానం అందింది. తను వెళుతున్నాడు కూడా. కానీ ప్రేమతో కాదు. భయంతో అంటున్నారు విశ్లేషకులు.


ఒకప్పుడు తాతగారి పేరు లేకుండా మాట్లాడే వాడు కాదు జూనియర్. చాలాకాలం క్రితమే తన స్పీచుల్లో తాతగారు మిస్ అయ్యారు. మరి ఇప్పుడు హైదరాబాద్ సభకు ఎందుకు వెళుతున్నారు అంటే.. ఈ సభకు తనతో పాటు అతనికంటే పెద్ద స్టార్స్ అయిన ప్రభాస్, పవన్ కళ్యాణ్‌, మహేష్‌ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్‌ లు కూడా వస్తున్నారు కాబట్టి. వీరిలో ముగ్గురు హీరోలు ప్యాన్ ఇండియన్ స్టార్స్ కూడా. వీళ్లే వస్తున్నప్పుడు తను వెళ్లకపోతే అది తన అభిమానుల్లోనే కాక తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ పాత అనుమానాలను బలపరుస్తూ కొత్త సమీకరణాలకు కారణం అవుతుంది.

అంటే అది తన ఇమేజ్ పై ప్రభావం చూపుతుంది. ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్డమ్ తో పాటు నంబరింగ్ కూడా కీలకంగానే ఉంటుంది. అంటే టాప్ త్రీ, టాప్ ఫైవ్ ఇలా.. ఈ రెండు కేటగిరీస్ లో ఉండేవారే తోప్ అనిపించుకుంటారు. కానీ ఇప్పుడీ రెండు కేటగిరీస్ లోనూ ఎన్టీఆర్ లేడు. టాప్ సిక్స్ లో ఉన్నాడు తారక్. అలాంటి తను ఇప్పుడీ సభకు హాజరు కాకపోతే ఆ టాప్ సిక్స్ నుంచి కూడా తన స్థానం మరింతగా దిగజారిపోతుందనేదే అసలు భయం. తను మహా నటుడే కావొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల అండ లేకుండా ఇంత పెద్ద స్టార్ కాలేడు అనేది ఒప్పుకుని తీరాల్సిన వాస్తవం. వాళ్లు లేకపోతే ఈ స్థానం పోతుంది. ఆ భయంతోనే అతను అంతమంది స్టార్స్ వస్తోన్న సభకు భయంతో వెళుతున్నాడు అంటున్నారు.


ఒక పచ్చి నిజం ఏంటంటే.. అసలు ఎన్టీఆర్ ప్లానింగ్ లో ఈ సభ లేదు. తను ఈ సభను మిస్ చేసుకుని ఈ నెల 28న ఖమ్మంలో జరిగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లాలి అనుకున్నాడు. తద్వారా తాతగారి బర్త్ డే రోజు తను పూర్తి టైమ్ కేటాయించాడు అనే సంకేతాలు అభిమానులతో పాటు టిడిపి శ్రేణుల్లోనూ పాజిటివ్ గా వెళతాయి. అందుకే తన బర్త్ డే రోజే జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి సభకు హాజరు కాకుండా తన పుట్టిన రోజులు మాల్దీవ్స్ లో జరుపుకునేందుకు టికెట్స్ కూడా వేసుకున్నారు.

తీరా చూస్తే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించొద్దు అని హౌ కోర్ట్ స్టే ఇచ్చింది.అది తన ప్లాన్ ను భంగం చేసింది. ఇటు చూస్తే హైదరాబాద్ లో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ముగింపు ఉత్సవాల సభకు టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా వస్తున్నారు. ఇప్పుడు తను వెళ్లకపోతే మొత్తం కెరీరే ప్రమాదంలో పడుతుందని గ్రహించి మాల్దీవ్స్ ప్రోగ్రామ్ ను క్యాన్సిల్ చేసుకుని విధిలేని పరిస్థితుల్లో భయంతోనే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ టాప్ సిక్త్స్ హీరోగా హాజరు కాబోతున్నాడు అనేది చాలామంది చెబుతోన్న మాట.

ఇవీ చదవండి

English News