మెగా లీకులూ ఓ స్ట్రాటజీయేనా..?

అంచనాలు పెంచడం అంటే మాటలు కాదు.. అందుకోసం మాటలే చెప్పాలి. ఆ మాటలతో మాయ చేస్తూ.. ప్రేక్షకులకు తమ చిత్రంపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా చేయాలి. అలా చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటాడు. కొన్నాళ్లుగా తను టంగ్ స్లిప్ అవుతున్నట్టు కనిపిస్తున్నా.. అది కూడా ప్రమోషన్స్ లో భాగంగానే పాస్ అయిపోతోంది.

ఆ మధ్య ఆచార్య టైటిల్ చెప్పాడు. రంగస్థలంలో ఆది పినిశెట్టి మరణం గురించీ ఇలాగే లీక్ చేశాడు. లేటెస్ట్ గా వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనూ ఇలాంటి టంగ్ స్లిప్స్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. ఓ రకంగా చూస్తే వీరయ్యపై మెగాస్టార్ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా నమ్మకాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరి వాటిని వాల్తేర్ వీరయ్య అందుకుంటాడా…?


పోటీ భారీగా ఉన్నప్పుడు ప్రేక్షకులను ఎట్రాక్ట్‌ చేయడానికి కొత్త ట్రిక్కులు చేయాల్సి ఉంటుంది. ట్రిక్కులు అని చెప్పలేం కానీ.. మెగాస్టార్ చిరంజీవి ముందు నుంచీ వాల్తేర్ వీరయ్యపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా చూసిన తర్వాతే రీసెంట్ గా ప్రెస్ మీట్ కు వచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

వీరయ్య ట్రైలర్ చూసిన తర్వాత మళ్లీ వింటేజ్ మెగాస్టార్ కనిపించాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రవితేజ ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా సందడి చేశాడు చిరంజీవి. తనదైన శైలిలో మాట్లాడుతూ సినిమాపై భారీ అంచనాలు పెంచే ప్రయత్నం చేశాడు.

ముఖ్యంగా ప్రతి పదినిమిషాలకు ఓ హై ఎండ్ మూమెంట్ కనిపిస్తుందని చెబుతూ ఇంకా కంటిన్యూ చేయబోతే దర్శకుడు బాబీ, రవితేజ ఆపేశారు. ఇక శ్రుతి హాసన్ పై చేసిన కమెంట్స్ కొందరికి సర్ ప్రైజింగ్ గా అనిపిస్తే మరికొందరికి ఫన్నీగా అనిపించాయి. అయితే ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లా ఉంటుందని చెప్పిన మాట విశేషంగా ఆకట్టుకుంది.

అయితే కొన్నళ్ల క్రితం వేరీజ్ ద పార్టీ అనే పాట సెట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సినిమా రొటీన్ గా ఉంటుందని చెప్పిన మాటను మరికొందరు గుర్తు చేస్తూ అది మర్చిపోయేందుకే .. ఇలా సరికొత్త డైలాగ్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాడు మెగాస్టార్ అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ సంక్రాంతి ఇంకా రాకముందే పందెంకోళ్ల సందడి బాగా కనిపిస్తోంది.

Related Posts