డాన్.. ఈ పదానికే ఓ రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ వెండితెరపై ఎక్కువగా విలన్ కే ఉంటుంది. సింపుల్ గా చెబితే డాన్ అంటే మనకు ఓ నెగెటివ్ రోల్ అనే అర్థం. బట్ 1978లో అమితాబ్ బచ్చన్ హీరోగా డాన్ పేరుతో ఓ సినిమా వచ్చిది. ఓ నెగెటివ్ టైటిల్ తో సినిమా చేయడమే సాహసం అంటే ఆ సాహసానికి దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
ఈ చిత్రాన్ని ఆ తర్వాతి యేడాదే తెలుగులో ఎన్టీఆర్ హీరోగా యుగంధర్ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడా బ్లాక్ బస్టర్. 1980లో రజినీకాంత్ తమిళ్ లో రీమేక్ చేశాడు. ఈ మూవీ అతని కెరీర్ నే మలుపు తిప్పింది. మాస్ హీరోగా నిలబెట్టింది. తర్వాత చాలా భాషల్లో రీమేక్ అయింది. అయితే ఈ తరానికి మరోసారి డాన్ గా షారుఖ్ ఖాన్ కనిపించాడు. 2006లో ఈ చిత్రాన్ని ‘డాన్ ద చేజ్ బిగెన్స్ అగెయిన్” అంటూ రీమేక్ చేస్తే మళ్లీ సూపర్ హిట్ అయింది.
దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా 2011లో షారుఖ్ డాన్2 చేస్తే ఇదీ హిట్. ఇక 2006 డాన్ ను తెలుగు, తమిళ్ లో బిల్లాగా చూపించారు మేకర్స్. తమిళ్ లో బిల్లాగా అజిత్ నటిస్తే.. తెలుగులో ప్రభాస్ నటించాడు. తమిళ్ లో సూపర్ హిట్ అయింది. తెలుగులో అబౌ యావరేజ్ అనిపించుకుంది. అజిత్ దీనికి ప్రీక్వెల్ చేస్తే అది పోయింది.
అయితే బాలీవుడ్ లో డాన్ సీక్వెల్ మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో మళ్లీ షారుఖ్ ఖాన్ నటిస్తాడుఅని భావించారు చాలామంది. బట్ మేకర్స్ మాత్రం షారుఖ్ కు షాక్ ఇవ్వబోతున్నారు. ఈ సారి కొత్త డాన్ గా రణ్‌వీర్ సింగ్ ను తీసుకోవాలనుకుంటున్నారు.
ఈ మేరకు దర్శకుడు ఫరాన్ అక్తర్ ఆల్రెడీ రణ్‌వీర్ సింగ్ కు కథ వినిపించి ఓకే చేయించుకున్నాడట. అంతేకాక అతనిపై ఓ ఫోటో షూట్ కూడా జరిగింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. డాన్ తో పాటు డాన్2 కూడా బ్లాక్ బస్టర్ కాబట్టి.. ఈ మూడో పార్ట్ పైనా భారీ అంచనాలుంటాయనే చెప్పాలి.