ఇండియాలో నెంబర్ వన్ పాపులర్ హీరోయిన్ సమంతే..

సమంత.. కొన్నాళ్లుగా చాలా చాలా విషయాల్లో హాట్ టాపిక్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా 2021 అక్టోబర్ లో అక్కినేని నాగ చైతన్యతో జరిగిన విడాకుల సంఘటన దేశవ్యాప్తంగా తను హాట్ న్యూస్ లో ఉండేలా చేసింది. విడాకులు తర్వాత సమంతపై వ్యక్తిగతంగా చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తప్పంతా తనదే అని తేల్చేశారు. మరికొందరు సోకాల్డ్ సనాతన వాదులైతే ఆమె జీవితాన్నే ప్రశ్నించారు. అన్నిటికీ ఓపిక పట్టిన తను విడాకులు అయిన ఐదు నెలల తర్వాత రియాక్ట్ అయింది. అంటే 2022లో. అప్పటి నుంచి చాలాకాలం పాటు దేశవ్యాప్తంగా తనో పెద్ద వార్త అయిపోయింది.

ఓ దశలో తను నోరు విప్పితే చాలామంది జీవితాలుతెలుస్తాయి అని హెచ్చిరించింది. అప్పటి నుంచి కాస్త విమర్శలు తగ్గాయి. మరోవైపు వీటిని తట్టుకుంటూనే మానసికంగా బలాన్ని చేకూర్చుకుని.. కొత్త సినిమాలు అనౌన్స్ చేసి నటిస్తూ వచ్చింది. విడాకులు తర్వాత పుష్ప సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ తనను దేశవ్యాప్తంగా మరోసారి పాపులర్ చేసింది. 2022లో ఓ తమిళ్ సినిమాతో పాటు యశోద మూవీతో లైమ్ లైట్ లో ఉంది. బట్ టైమ్ ఆమె జీవితంతో మరోసారి ఆడుకుంది. ఈ సారి మయోసైటిస్ అనే అరుదైన చర్మవ్యాధి బారిన పడింది. ఈ విషయాన్ని యశోద సినిమా విడుదల సమయంలో ప్రకటించింది. మరోవైపు విజయ్‌ దేవరకొండతో చేస్తోన్న ఖుషీ మూవీ ఈ కారణంగానే ఆగిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే తను సడెన్ గా సైలెంట్ అయితే.. అదీ వార్తే అయిపోయింది. ఇలా ఎలా చూసినా.. సమంత నిత్యం వార్తల్లో ఉంటూనే వచ్చింది. అందుకే తను ఇప్పుడు “మోస్ట్ పాపులర్ ఫీమేల్ ఫిల్మ్ స్టార్స్ ఆఫ్ 2022” గా ఎంపికైంది.


ప్రతి యేడాది పాపులర్ ఫిల్మ్ స్టార్స్ లిస్ట్ ను అనౌన్స్ చేస్తోన్న ఒరామిక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సమంతకు ఫస్ట్ ప్లేస్ దక్కడం విశేషం. సమంత ముందు బాలీవుడ్ బ్యూటీస్ అయిన అలియాభట్ సెకండ్ ప్లేస్ కు వెళితే దీపికా పదుకోణ్ ఐదో స్థానంలో ఆగిపోయింది. ఇక మూడో స్థానంలో నయనతార, నాలుగో స్థానంలో కాజల్ ఉండటం విశేషం.


ఈ సర్వే ప్రకారం నేషనల్ క్రష్ అంటూ ఊదరగొట్టిన రష్మిక మందన్నా ఆరో స్థానంలో ఉండటం ఆశ్చర్యం. ఏడో స్థానంలో కత్రినా కైఫ్‌ ఉంటే ఆ తర్వాత వరుసగా ఎనిమిదిలో కీర్తి సురేష్, తొమ్మిదో ప్లేస్ లో అనుష్కశెట్టి.. పదో స్థానంలో త్రిష ఉన్నారు.
మొత్తంగా సమంత ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పేందుకు ఈ సర్వే ఒక ఉదాహరణ. ఇక ఈ యేడాది తను ఖుషీతో పాటు రీసెంట్ గా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించబోతోంది.

Related Posts