చైనా దొంగబుద్ధి తోక కట్ చేసిన ఇండియా…!!
Latest

చైనా దొంగబుద్ధి తోక కట్ చేసిన ఇండియా…!!

తాటిని తలదన్నేవాడు ఉంటే… వాడి తలను తన్నే వాడు మరొకడు ఉంటాడు.. డ్రాగన్ కంట్రీ చైనాకి ఇదే పరిస్థితి ఎదురయింది.. ఆ దేశం వేసిన ఎత్తుకు పై ఎత్తు వేసింది ఇండియా.. దీంతో, దిక్కుతోచని స్థితిలో పడిపోయింది చైనా.. ఇకపై డ్రాగన్ అధినేత జిన్ పింగ్ కి చుక్కలు చూపించాలని నిర్ణయించుకుంది భారత్ సర్కార్..

గత కొంతకాలంగా బోర్డర్లో ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తోంది చైనా సర్కార్.. దీనికి ధీటుగా జవాబు ఇస్తోంది ఇండియా.. గాల్వన్ ఘటనతో డ్రాగన్ కి ఘోర పరాజయం చవిచూసింది.. ఆ స్థితిలో మరో దేశం అయితే ఇండియాతో పెట్టుకోవడానికి పదేళ్లు భయపడేది. అంతటి ఘోర అపజయం అది.. ఆయుధాలు ఉపయోగించని, కేవలం మల్లయుద్ధం, వీధి ఫైట్ ని తలపించే ఈ వార్ లో భారత్ కి చెందిన జవాన్లు 20 మంది వీరమరణం పొందగా, డ్రాగన్ కి చెందిన సైనికులు 150 మందికిపైగా మరణించారు.. మరోవైపు, అంతకుమించి సైనికులు గాయాలు బారిన పడ్డారు..

అయినా, డ్రాగన్ కి బుద్ధి రాలేదు.. ఇండియాపై కయ్యానికి కాలు దువ్వుతోంది.. వరసగా అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, సిక్కిం ప్రాంతాలలో తన సైన్యాన్ని బరిలోకి దించుతోంది.. ఈ సరిహద్దు ప్రాంతాలలో భారీ నిర్మాణాలు చేపడుతోంది.. ఇటు రైల్వే ట్రాక్ లు, యుద్ధ విమాన బేస్ లు…. నిర్మిస్తోంది.. ఇవన్నీ ఇండియాని రెచ్చగొట్టడానికే అని మిలిటరీ నిపుణులు విశ్లేషిస్తున్నారు..

మరోవైపు, ఇటు చర్చలకు సై అంటూనే.. అటు కయ్యానికి కాలు దువ్వుతోంది.. జులై 26వ తేదీ విజయ్ దివస్.. అంటే కార్గిల్ యుద్ధంలో పాక్ కి బుద్ధి చెప్పి విజయం సాధించిన రోజుని విజయ్ దివస్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది ఇండియా.. ఆ రోజున చర్చలకు తాము సిద్ధం అని, అదే రోజు ఇరు దేశాల మిలిటరీ, విదేశాంగ ప్రతినిధుల మధ్య చర్చలు జరపాలని పట్టు బట్టింది డ్రాగన్..

ఆ దేశ దుర్బుద్ధి, కుత్సితం తెలుసుకున్న ఇండియా.. అది సాధ్యం కాదని, మరో రోజు కలుద్దాం.. లేదంటే మీ ఇష్టం అని తెగేసి చెప్పడంతో సైలెంట్ అయింది.. అంతేకాదు, భారత్ ని ఇరుకున పెట్టడానికి డ్రాగన్ వరసగా బోర్డర్ లో యుద్ధ విమాన ఎయిర్ పోర్టులు నిర్మిస్తోంది.. ఇటు, భారీగా సైన్యాన్ని తరలిస్తోంది.. ఇటు, టిబెట్ పౌరులను తన సైన్యంలోకి తీసుకొని , ఇండియాపైకి ఎగదోయాలని చూస్తోంది.. టిబెట్ స్వాతంత్ర్య పోరాటానికి చెక్ పెట్టడానికి ఎత్తుగడ వేస్తోంది.

మరోవైపు, భారత్ ఈ కుయుక్తులకు చెక్ పెడుతోంది… చైనాకి ఎక్కడిక్కడ బ్రేకులు వేస్తోంది.. ధీటుగా వ్యూహరచన చేస్తోంది.. దీంతో, డ్రాగన్ తల పట్టుకుంటోంది.. ఇండియాని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో కూడా అర్ధం కావడం లేదు… ఇటు, గాల్వన్ ఘటన పరాభవానికి ప్రతీకారం రగిలిపోతోన్న చైనా…. ఇండియాని టార్గెట్ చేస్తోంది.. మరి, ఏం జరుగుతుందో చూద్దాం…

Post Comment